Akhil: హీరో అఖిల్ ను నమ్మి మునిగిపోయిన నిర్మాతలు వీళ్లేనా?

Akhil: అక్కినేని కాంపౌండ్ నుంచి అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి వారిలో అఖిల్ అక్కినేని ఒకరు. సిసింద్రీ సినిమాలో బాలనటుడిగా నటించిన అఖిల్ అనంతరం మనం సినిమాలో చిన్న రోల్ లోకనిపించే సందడి చేశారు. అయితే ఈయన మాత్రం అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.ఇలా మొదటి సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడి ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైంది.

 

ఇలా అఖిల్ సినిమాపై భారీ అంచనాలతో మేకర్స్ ఈ సినిమాని విడుదల చేయగా ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సినిమా తర్వాత అఖిల్ తన తదుపరి చిత్రాలు హలో మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించారు. అయితే ఇందులోమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా మిగిలిన సినిమాలు అన్ని ఫ్లాప్ అయ్యాయి.

 

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేక నిర్మాతలకు భారీ నష్టాన్ని తీసుకువచ్చింది. అయితే అఖిల్ తో సినిమా చేస్తే నిర్మాతలకు భారీ నష్టాలే మిగులుతాయని మరోసారి నిరూపితమైంది.

 

అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ మూవీకి నిర్మాత నితిన్ ఈ సినిమా ద్వారా నితిన్ నష్టాలను ఎదుర్కొన్నారు. అనంతరం అఖిల్ నటించిన హలో మూవీ నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జునకు కూడా ఈ సినిమాతో నష్టాలు తప్పలేదు అనంతరం తన తదుపరి చిత్రం, మిస్టర్ మజ్ను. ఈ సినిమాని నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ ఎదుర్కొంది. ఇక తాజాగా ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర ఈయనకు కూడా నష్టాలు తప్ప లేదని చెప్పాలి. అఖిల్ నటించిన ఈ సినిమాలన్నీ హిట్ పర్సంటేజ్ కేవలం 20 శాతం కావడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -