Relationship: మీలో ఆ కోరికలు తగ్గాయా.. కచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే!

Relationship: సాధారణంగా యుక్త వయసుకు వచ్చిన తర్వాత అబ్బాయిలు అమ్మాయిలలో సాధారణంగా సెక్స్ కోరికలు పెరగడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత చాలా ఆసక్తిగా పాల్గొంటూ తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే పోను పోను శృంగారం పట్ల కోరికలు తగ్గుతూ ఉంటాయి. ఇలా శృంగారం పట్ల కోరికలు ఆసక్తి తగ్గడానికి ఎన్నో కారణాలు ఉంటాయి మరి ఆ కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా పురుషులలోనూ స్త్రీలలోను టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లో అధికంగా ఉత్పత్తి అయినప్పుడు వారిలో సెక్స్ కోరికలు అధికంగా కలుగుతాయి ఎప్పుడైతే ఈ హార్మోన్లో ఉత్పత్తి తగ్గుతుందో ఆ సమయంలో వారిలో సెక్స్ కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఇలా స్త్రీలలో ఈస్ట్రోజన్ పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడానికి కుటుంబ సమస్యలు అధిక ఒత్తిడి డిప్రెషన్ కూడా కారణం కావచ్చు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంపాదనపై పడి ఎక్కువ సమయం సంపాదించడానికి కేటాయించడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడికి గురైన సమయంలో హార్మోన్ల ఉత్పత్తి కూడా తగ్గిపోయి శృంగారంపై ఆసక్తి చూపడం లేదు.

ఇక పురుషులలో త్వరగా అంగస్తంభనం కావడం శీఘ్ర స్కలనం కావడం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వారు సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు.ఇక పురుషులు లేదా స్త్రీలు థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్న తరుణంలో కూడా ఇది శృంగార జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. థైరాయిడ్ గుండెజబ్బులు వంటి సమస్యలతో బాధపడే వారిలో సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిపై ఈ ఆరోగ్య సమస్యలు ప్రభావం చూపుతాయి.

ఇక డయాబెటిస్,క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి మందులు తీసుకుంటున్నటువంటి వారిలో కూడా ఇలాంటి సమస్యలు అధికమవుతాయి. అయితే వీటి నుంచి బయటపడాలి అంటే ఎప్పుడు మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అధిక ఒత్తిడి డిప్రెషన్ నుంచి బయటకు రావడం,సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వాకింగ్ యోగా వ్యాయామం వంటివి చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడి తిరిగి సెక్స్ జీవితంలో ఎంజాయ్ చేయవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -