Relationship: మీ భార్య, భర్తపై అనుమానం ఉందా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Relationship: భార్య భర్తల మధ్య గొడవలు రావడం అన్నది సహజం. ఈ గొడవలు రావడానికి అనే కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో చీటింగ్ కూడా ఒకటి. చాలామంది భార్య భర్తల దాంపత్యంలో ఈ చీటింగ్ అనే అంశం చాలా సార్లు వినిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ చీటింగ్ అనే పదం భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కూడా కారణం అవుతుంది. అంటే భార్యకు తెలియకుండా భర్త మరొకరితో ఎఫైర్ నడిపించడం భర్తకు తెలియకుండా భార్య మరొకరు తో ఎఫైర్ నడపడం లాంటివి చీటింగ్ కిందికే వస్తాయని చెప్పవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒకే మ‌నిషితో సాంగ‌త్యం అనేది క్ర‌మేపీ బోర్ డ‌మ్ ను క‌లిగించ‌వ‌చ్చు. ఇది యుక్త వ‌య‌సులో ఉన్న‌ప్పుడే ఎక్కువ‌గా క‌లుగుతూ ఉంటుంది. అంటే ఇది పెళ్లి చేసుకున్న కొంత‌కాలానికే క‌లిగే భావ‌న కావచ్చు. దీన్ని దాటిన వారి మ‌ధ్య‌న ఎమోష‌న‌ల్ అటాచ్ మెంట్ ఏర్ప‌డుతుంది. అది ఏర్ప‌డ‌క‌పోతే వివాహం అయిన కొంత‌కాలానికే బోర్ డ‌మ్ అనే ఫీలింగ్ క‌ల‌గవచ్చు. దీని వ‌ల్ల ప‌క్క చూపులు చూసే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే నిర్ల‌క్ష్యం, అన్ హ్యాపీనెస్.. త‌మ పార్ట‌న‌ర్ త‌మ‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తూ ఉన్నార‌నే భావ‌న కూడా ప‌క్క చూపుల‌కు ప్ర‌ధాన కార‌ణాల్లో ఒక‌టి. అది స్త్రీ అయినా, పురుషుడు అయినా పార్ట్న‌ర్ చేత బాగా నిర్ల‌క్ష్యానికి గుర‌యిన‌ప్పుడు ఇలాంటి వ్య‌వ‌హారాల‌ వైపు చూసే అవ‌కాశం ఎక్కువగా ఉంటుంది.

 

త‌ద్వారా త‌మ‌లోనూ అట్రాక్టివ్ నెస్ ఉంద‌ని నిరూపించుకుని, త‌మ ఇగోకు తృప్తిని క‌లిగించ‌వ‌చ్చు. పార్ట్న‌ర్ చూసే నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌లిగే అన్ హ్యాపీనెస్ ఈ బంధాల వైపు దారి తీస్తుందట.
అలాగే బంధానికి స్వస్తి పిలకడం అన్నది ఇదొక విచిత్ర‌మైన అంశ‌ం. వైవాహిక జీవితం నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణ‌యించుకుని కూడా కొంద‌రు కావాల‌ని ఇటువంటి బంధాల వైపు చూస్తారట. అంటే వివాహేత‌ర సంబంధం ద్వారా ఈ వివాహం పై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని పార్ట్న‌ర్ కు తెలియ‌జెప్ప‌డానికి కొంద‌రు ఇలాంటి ఎక్స్ ట్రా మ్యారిట‌ల్ ఎఫైర్స్ వైపు చూస్తార‌ట. అలాగే ప‌ర‌స్ప‌రం ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్ ఏర్ప‌డ‌క‌పోవ‌డం కూడా ఈ బంధాల‌కు కార‌ణాల్లో ఒక‌టి. ఒక‌రి కోసం మ‌రొక‌రు క‌నీస స్థాయిలో స్పందించ‌క‌పోవ‌డం చాలేమో ఆ బంధంలో ప‌ర‌స్ప‌రం ఎలాంటి ఆస‌క్తి లేద‌ని అర్థం చేసుకోవ‌డానికి. దాంప‌త్యంలో ఇలాంటి క‌నెక్ష‌నే ఏర్ప‌డ‌క‌పోతే ప‌క్క చూపుల‌కు ఆస్కార‌మే కాదు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -