Weight Gain: పెళ్లి తర్వాత బరువు పెరుగుతున్నారా.. మీరు ఈ తప్పులు చేస్తున్నట్టే!

Weight Gain: ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య అందరినీ వేధిస్తోంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వ్యాయామలు చేయటం డైటింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా యువతీ యువకులు పెళ్లికి ముందు ఒకలా పెళ్లయిన తర్వాత మరొకలా ఉంటారు. పెళ్లికి ముందు సన్నగా ఫిట్ గా ఉండే యువతీ యువకులు పెళ్లి తర్వాత బరువు పెరుగుతారు. అయితే పెళ్లి తర్వాత భార్యాభర్తలు బరువు పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి.

పెళ్లి తర్వాత యువతి యువకులు బరువు పెరగడానికి గల కారణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా పెళ్లికి ముందు సన్నగా ఉండే వారు పెళ్ళి తరువాత బరువు పెరుగుతారు. ఎందుకంటే పెళ్లి సమయంలో రక రకాల వంటలు చేసి వధు వరులకు వడ్డిస్తారు. దీంతో వారు కొంచం బరువు పెరుగుతారు. అంతే కాకుండా పెళ్లి అయిన తరువాత నూతన వధూవరులను బందువులు తమ ఇంటికి ఆహ్వానించి వివిధ రకాల వంటలు రుచి చూపిస్తారు

 

ఇలా పెళ్ళి అయిన కొత్తలో దాదాపు నెల రోజుల బంధువుల ఇళ్లకు వెళ్లి వివిధ రకాల పిండి వంటలు తినటం వల్ల బరువు పెరుగుతారు.అంతే కాకుండా పెళ్ళి తరువాత మహిళలు గర్భం దాల్చడంతో పిల్లల ఆరోగ్యం కోసం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల బరువు పెరుగుతారు. ఇక డెలివరీ తరువాత కూడా మహిళలు బరువు పెరుగుతారు. పిల్లలు పుట్టిన తరువాత భాద్యతలు పెరగటం వల్ల వ్యాయామాలు చేయటానికి సమయం కుదరకపోవడంతో పురుషులు కూడా బరువు పెరుగుతారు.

 

ఆ తరువాత కొంచం వయసు పెరగటంతో అనారోగ్య సమస్యలకి మందులు ఉపయోగించటం వల్ల కూడా కొంతమంది బరువు పెరుగుతారు. ఇలా పెళ్లి తర్వాత మహిళలు పురుషులు ఇద్దరు కూడా అధిక శరీర బరువు పెరగడానికి దోహదమవుతున్నాయి. అయితే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మన శరీరం కోసం కాస్త సమయం కేటాయించి సరైన వ్యాయామాలు చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -