Arvind Kejriwal: కేజ్రీవాల్ మెడకు మరో కుంభకోణం.. ఆప్‌కు మరిన్ని చిక్కులు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కుంభకోణం ఢిల్లీలోని ఆప్ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ లో తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రన్ పిశ్లై ఉండటంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు రేపుతోంది. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈ కుంభకోణంలో ఉన్నారని బీజేపీ నేతలు బయటపెట్టిన ఆధారాలు దుమారం రేపుతున్నాయి. ఇక ఈ కుంభకోణంలో సీఎం జగన్ భార్య భారతికి కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఇప్పటికే ఈ కుంభకోణంతో లింకులు ఉన్న వారిపై సీబీఐ, ఈడీ,ఐటీ దాడులు చేపట్టింది. పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ కుంభకోణంలో ఏ1గా అభియోగాలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇళ్లు, కార్యాలయాల్లో ఇఫ్పటికే సీబీఐతో పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. అక్కడ దొరికిన ఆధారాల ఆధారంగా ఈ కుంభకోణంలో ఉన్నవారిని గుర్తించి వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఢిల్లీలో జరిగిన కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలకు కూడా లింకులు ఉండటంతో ఇక్కడ కూడా రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఇప్పటికే ఆప్ సర్కార్ మెడకు చుట్టుకోవడంతో చిక్కుల్లో పడింది. ఈ క్రమంలో ఆప్ సర్కార్ ను ఉక్కిరి బిక్కరి చేసేలా మరో కుంభకోణం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో వెయ్యి లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్నాయని, టెండరింగ్ కు, బస్సుల కొనుగోలుకు ముందస్తుగానే ఒప్పందం జరిగిందనే సమాచారం తన దగ్గరకు వచ్చిందని లెప్టినెంట్ గవర్నర్ తెలిపారు. అందుకే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు.

బస్సుల కొనుగోలుకు సంబంధించి ఢిల్లీ రవాణా కార్పొరేషన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఈ కమిటీకి రవాణశాఖ మంత్రిని ఛైర్మన్ గా నియమించారు. ముందస్తు ఒప్పందలో భాగంగానే ఇదంతా జరిగిందని, బస్సుల కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఢిల్లీ చీఫ్ సెక్రటరీని లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వివరణ కోరారు. ఈ ఆరోపణలు వాస్తవమేనంటూ చీఫ్ సెక్రటరీ లెప్టినెంట్ గవర్నర్ కు నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించారు.

లెప్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. ఇప్పటికే లిక్కర్ కుంభకోణంతో సమమవతమవుతున్న ఆప్ సర్కార్ కు.. ఇప్పుడు బస్సుల కొనుగోలు అంశం మెడకు చుట్టుకుంది. దీంతో కేజ్రీవాల్ మరింత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వరుస సీబీఐ కేసులతో ఆప్ సర్కార్ ఇబ్బందుల్లోకి వెళ్లింది. నేతలపై ఐటీ దాడులు, సీబీఐ కేసులు, ప్రభుత్వం వస్తున్న ఆరోపణలు కేజ్రీవాల్ కు తలనొప్పిగా మారాయి. బస్సుల కొనుగోలు వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందోననే భయం ఆప్ సర్కార్ లో ఉంది. కేంద్రం వరుస పెట్టి ఇబ్బందులకు గురి చస్తుండటంతో కేజ్రీవాల్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఇప్పుడు బస్సుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఎక్కడి వరకు దారి తీస్తాయా.. సీబీఐవిచారణలో ఏం తేలుతుంది. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -