Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వరుసగా భారీ షాకులు.. అసలేం జరిగిందంటే?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సిబిఐ అధికారుల కష్టడిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఈమెకు మరోసారి చేదు అనుభవమే ఎదురయింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని సవాలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్ట్ కొట్టివేసింది. ఇక సీబీఐ కస్టడీకి అప్పగించడానికి సంబంధించిన పిటిషన్‌పై తీర్పును కోర్ట్ రిజర్వ్ చేసింది.

ఇక కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందోనని అందరిలో ఆందోళన నెలకొంది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రశ్నించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.అలాగే లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రకు సంబంధించిన కీలక విషయాలను సీబీఐ బహిర్గతం చేసింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో తెలిపింది.

ఇక ఈ కస్టడీ రిపోర్టులో భాగంగా కవిత జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు పేర్కొంది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలుస్తుంది. లాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో ఎలా బిజినెస్ చేసుకుంటారో చూస్తాను అంటూ ఈమె బెదిరించినట్టి సిబీఐ రిపోర్ట్ లో వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -