BRS Kavitha: కవితకు భారీ షాక్.. 14 రోజుల కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇక బయటకు రావడం కష్టమేనా?

BRS Kavitha: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈడి అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇది అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఈమె నేడు కోర్టుకు హాజరయ్యారు. ఇక నేడు తనుకు బెయిల్ వస్తుందని బిఆర్ఎస్ నేతలు అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈమెకు కోర్టు నుంచి ఊహించని తీర్పు వచ్చిందని చెప్పాలి. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఈమె కోరగా ఈడీ మాత్రం తనకు కస్టడీ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదములు జరిగాయి. ఈ వాదనల అనంతరం కోర్టు తీర్పులు ప్రకటిస్తూ మరో 14 రోజులపాటు కవిత కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈమె ఏప్రిల్ 9వ తేదీ వరకు ఈడీ అధికారుల కస్టడీలో ఉండబోతున్నారు. ఇలా తీర్పు వెల్లడించినటువంటి కోర్టు ఈమెను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరు పరచాలని న్యాయస్థానం తీర్పు ప్రకటించారు.

ఈ కేసులో తనకు ఎలాంటి అక్రమాలు లేవని తాను ఎలాంటి అవినీతి చేయలేదు అంటూ అరెస్టుకు ముందు చెప్పినటువంటి కవిత తాను అరెస్ట్ అయినప్పటికీ కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు. అయితే ఈమెకు కోర్టు మధ్యంతర బెయిల్ ప్రకటించకపోవడంతో ఇప్పుడప్పుడే కవిత బయటకు వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -