AP Liquor Scam: ఏపీ మద్యం స్కాం విషయంలో ఈడీ కేసులు నమోదు.. వైసీపీకి ఇబ్బందులు తప్పవా?

AP Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసు ప్రస్తుతం దేశంలోనే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఢిల్లీ మంత్రులు జైలు జీవితం గడుపుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని జోరుగా చర్చ జరుగుతోంది. అటు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఇవాళో రేపో అరెస్ట్ ఖాయమని అంటున్నారు. అంతేకాదు.. ఈ కేసు పంజాబ్, గోవా రాష్ట్రాలకు కూడా చుట్టుకుంది. అయితే.. ఈ కేసులో ఐదు వేల కోట్ల అవినీతి జరిగినట్టు ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఐదు వేల కోట్ల అవినీతి కేసు దేశ రాజకీయలను శాసిస్తుంది. ప్రస్తుతం ఈడీ, సీబీఐ సంస్థంల్లోని మెజార్టి అధికారులు ఈ కేసులోనే తలమునకలై ఉన్నారు. ఐదు వేల కోట్ల అవినీతి కేసుపైనే ఇంత ఫోకస్ చేస్తే.. ఏడాదికి 25 వేల అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్న కేసుపై ఎంత ఫోకస్ పెట్టాలి. అంత అవినీతి ఎక్కడో కాదు. ఏపీలోనే జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. అది కూడా ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీలోనే పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏపీలోని మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ జరగడం లేదు. ఏపీలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ దుకాణాల్లో మొదటి మూడేళ్లు డిజిటల్ పేమెంట్స్ జరగలేదు. ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆరు నెలల పాటు.. డిజిటల్ పేమెంట్స్ జరుగాయి. అది కూడా అక్కడక్కడ జరిగాయి. మళ్లీ రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయి. చిన్న చిన్న వ్యాపారులు కూడా డిజిటప్ పేమెంట్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ.. ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో మాత్రం ఆన్‌లైన్ పేమెంట్స్‌ను అంగీకరించడం లేదు. రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించే వారు ఉన్నారు. వారంతా రోజుకి కనీసం 200 రూపాయల మందు తాగినా.. ఏడాదికి 50 వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. కానీ… అందులో సగం మాత్రమే లెక్కలు చూపించి మిగిలిన సొమ్ముతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి.

2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకి 50 వేల కోట్లు మద్యం ద్వారా అర్జించేదని ఓ అంచనా. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ధరలు పెరిగాయి కనుక రోజుకు 80 కోట్లుకు చేరిందని లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో నాణ్యమైన బ్రాండ్స్ కూడా లేవు. 116 రకాల బ్రాండ్స్ ఉన్నాయని బోర్డులు పెట్టినా.. కేవలం ఐదారు బ్రాండ్స్ మాత్రమే దొరుకుతాయి. వాటికి పేమెంట్ చేయడానికి ఓ ప్రైవేట్ కంపెనీ ఓ యాప్ కూడా తయారు చేసింది. కానీ, అది పని చేయడం లేదు. దీంతో డిజిటల్ చెల్లింపులు ఆగిపోయాయి. క్యాష్ తీసుకొని వచ్చిన వారికే లిక్కర్. లేదంటే ఒత్తి చేతులతో వెనుదిరగాల్సిందే. డిజిటల్ చెల్లింపులు లేవు కనుక.. ఎంత ఆదాయం వస్తుంది? అనేదాని పై స్పష్టత ఉండదు. లెక్కలు తక్కువ చూపించి జీఎస్టీని ఎగ్గొడుగున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ విషయంలో ఈడీపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. పలువురు ఏపీలో జరుగుతు లిక్కర్ అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అందుకే.. ఈడీ త్వరలో కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే.. ఏపీ లిక్కర్ స్కాం సంచలనంగా మారే అవకాశం ఉంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -