Ashok Gehlot: రాజస్థాన్ లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. అశోక్ గెహ్లాట్ పై సీరియస్

Ashok Gehlot: ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. తానొక్కటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్ధితి. రాజస్థాన్ పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానానిని తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికలు రాజస్థాన్ లో కాంగ్రెస్ ను చిక్కుల్లోకి నెట్టేశాయి. రాజస్థాన్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతోన్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో రాజస్థాన్ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

సచిన్ పైలెట్ కు సీఎంగా ఇస్తామనడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ కు రాజీనామా పత్రాలు ఇవ్వడం సంచలనం రేపుతోంది. అయితే సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ మధ్య విబేధాలు తారాస్ధాయిలో ఉన్నాయి. అందుకే సచిన్ పైలెట్ కు సీఎం పదవి రాకుండా చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. స్పీకర్ జోషి పేరును ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల రాజీనామ వెనుక అశోక్ గెహ్లాట్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్యేల రాజీనామాతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజస్థాన్ లోని పరిస్ధితులను చక్కపెట్టేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు అశోక్ గెహ్లాట్ తెలిపారు.

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనున్నాయి. సోనియాగాంధీ సూచనతో అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు అశోక్ గెహ్లాట్ సిద్దమయ్యారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశముంది. ఇలాంటి తరుణంలో రాజస్థాన్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయనేది సస్పెన్స్ గా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అశోక్ గెహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆలోపు రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనేది ఫిక్స్ చేయాల్సి ఉంది.

దీంతో రాజస్థాన్ లో నెలకొన్న అనిశ్చితిపై సోనియా గాంధీ వరుస భేటీలో నిర్వహిస్తున్నారు. మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కమల్ నాధ్ లతో చర్చలు జరుపుతున్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సోనియాగాంధీకి నేతలు వివరించారు. సచిన్ పైలెట్ కు వ్యతిరేకంగా ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయనకు కేటాయిస్తారా.. లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నారు. దీంతో సీఎంగా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటంతో ఏం జరుగుతుందననే ఉత్కంఠ నెలకొంది.

కాంగ్రెస్ అధినాయకత్వం కూడా సచిన్ ఫైలెట్ కు ఇవ్వాలని చూస్తోంది. కానీ అశోక్ గెహ్లాట్ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి సచిన్ పైలెట్ కు పదవి రాకుండా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయనను కాంగ్రెస్ అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వం నుంచి కూడా తప్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్ లోని కాంగ్రెస్ సంక్షోభానికి ఆయనే కారణమయ్యారనే వార్తలు వస్తున్నాయి. దీంతో అశోక్ గెహ్లాట్ పై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -