Andhra Pradesh: ఏపీలో వ్యూహకర్తల మాటే శాసనం వ్యూహకర్తలదే పెత్తనం.. వాస్తవ పరిస్థితులు ఇవే!

Andhra Pradesh: దేశ రాజకీయాలలో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకు అధికమవుతుందని చెప్పాలి. ఒక పార్టీ ప్రచార కార్యక్రమాల నుంచి మొదలుకొని మేనిఫెస్టోల వరకు కూడా ఈ వ్యూహకర్తలు చెప్పిన విధంగానే పార్టీ నేతలు నడుచుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఇలా ప్రచార కార్యక్రమాలు ఉండేవి కాదు.స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి దాని ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు.

ఇలా ప్రచార కర్తల సాంప్రదాయం ప్రశాంత్ కిషోర్ తోనే మొదలైందని చెప్పాలి.పదేళ్ల క్రితం ఆయన సిటిజన్స్ ఫర్ ఎకౌంటబుల్ గవర్నెన్స్( CAG) ని స్టార్ట్ చేశారు. రెండేళ్ల తర్వాత అది ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( I-PAC) గా మారింది. 2014 నుంచి ఎన్నికల వ్యూహాలను రచించడం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఐపాక్ సంస్థలు కూడా వ్యూహకర్తలు గానే వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలకు ఐపాక్ సమస్త చెప్పినటువంటి వ్యూహాలను అమలు పరచడంతోనే భారీ స్థాయిలో మెజారిటీ లభించిందని చెప్పాలి ఈ నవరత్నాల ఐడియా కూడా వీరిదేనని తెలుస్తుంది. రాజకీయ వ్యూహకర్తల్లో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి సునీల్ కనుగోలు. ఈయన తొలుత బీజేపీ తరఫున వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో జతకట్టి కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయం అందుకోవడానికి కారణమయ్యారు.

కేవలం కర్ణాటకలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సునీల్ కొనుగోలు వ్యూహం బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక ఈయన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహలక్ష్మి వంటి పథకాలు మేనిఫెస్టోలో చేర్చమని చెప్పినటువంటి ఘనత సునీల్ కొనుగోలుకు మాత్రమే ఉందని చెప్పాలి అయితే ఈ వ్యూహం భారీగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అందుకే రాజకీయాలను వ్యూహకర్తలే శాసిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -