Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా.. ఏమైందంటే?

Jr.NTR: సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు దివంగత నేత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ మరణాంతరం తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతిలోకి వెళ్లిపోయాయి. అయితే నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలోకి రావాలని ఎంతోమంది నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

గతంలో ఓసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లి ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాస్త అయోమయంగానే ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే కనుక పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని కోరుతూ ఉండగా ఎన్టీఆర్ సైతం రాజకీయాలపై కాస్త ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

 

ఇలా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆరాటపడుతున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రాకుండా అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ స్వయంగా చెప్పకపోయినా ఎన్టీఆర్ పట్ల వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను తన పార్టీకి దూరం పెట్టే ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తోంది.

 

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఈయన కనుక రాజకీయాలలోకి వస్తే రాజకీయాలన్నీ తారుమారవుతాయి ఇక ఎన్టీఆర్ కనుక రాజకీయాలలోకి వస్తే తాను గెలిచే అవకాశాలు 100కు 100% ఉన్నాయి కనుక తన కుమారుడు లోకేష్ రాజకీయాలకు ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ ను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అందుకే తనను దూరం పెడుతున్నారని తెలుస్తుంది. తాజాగా జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో కూడా ఎన్టీఆర్ కి ఆహ్వానం పంపకపోవడం ఇందుకు నిదర్శనమని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -