Balaji: ఆ ఒక్క తప్పే రాజేంద్రప్రసాద్ కొడుకు జీవితాన్ని నాశనం చేసిందా?

Balaji: నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ‘రాజేంద్రప్రసాద్’. అప్పట్లో ఆయన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుందనే జనాలు ఒక్కసారిగా పోటెత్తేవారు. ఎక్కువ శాతం ఆయన కామెడీ సినిమాల్లో నటించడంతో.. ఆ మూవీస్‌ను చూడటానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఇప్పటికీ ఆ సినిమా ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రాజేంద్రప్రసాద్ క్యార్టెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. యంగ్, స్టార్ హీరోల సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తన మార్క్ ను కొనసాగిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ యాక్టింగ్‌కు ‘నటకిరీటీ’ అనే బిరుదు కూడా వచ్చింది.

 

చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని రాజేంద్రప్రసాద్‌ కలలు కనేవారట. ఎన్టీఆర్ సినిమాలు చూసి.. తనలాగే నటుడు అవ్వాలని అనుకున్నారట. ఈ క్రమంలో ఓసారి ఎన్టీఆర్‌ను కలిసి ఆయన సలహాలు తీసుకున్నారు రాజేంద్రప్రసాద్. ఎన్టీఆర్ సలహాతోనే దేవదాసు కనకాల దగ్గర యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. నటనలో శిక్షణ పొంది పట్టా పొందారు. ఈ తర్వాత సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేశారు. జంధ్యాల దర్శకత్వంలో పలు కామెడీ సినిమాలు చేశారు. ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా కామెడీ సినిమాలు చేస్తూ.. సక్సెస్ అయ్యారు. కానీ ఆ తర్వాత పలు సినిమాలు హిట్ కాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు.

 

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్‌.. సినిమాల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికంగా వెల్ సెటిల్డ్. అయితే వ్యక్తిగత విషయంలో మాత్రం రాజేంద్ర ప్రసాద్‌కు ఓ తీరని లోటు మిగిలింది. అది ఎప్పటికీ తీరకపోవడంతో రాజేంద్రప్రసాద్ సంతోషంగా ఉండటం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కొడుకు బాలాజీ ప్రసాద్‌ను హీరో చేయాలని ఎన్నో కలలు కన్నారట. ఈ క్రమంలో చాలా సార్లు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కొడుకును హీరోని చేయలేకపోయారు. ఈనాడు అధినేత రామోజీరావు అప్పట్లో బాలాజీ ప్రసాద్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నారు. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరో లుక్ లేదని అందరూ అనడంతో చాలా వరకు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో బాలాజీ ప్రసాద్ తన తండ్రి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదని సినిమాలు వదిలేసి.. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం అందులో బాగానే రాణిస్తున్నారు. కానీ రాజేంద్రప్రసాద్‌లో ఆ వెలితి ఇప్పటికీ అలానే ఉంది. కొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోగా ఉండే వాడని రాజేంద్రప్రసాద్ ఎప్పుడూ బాధపడుతూ ఉంటారట.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -