Balayya: బాలయ్య డ్యాన్స్ గురించి ఫ్యాన్స్ కామెంట్లు వింటే అవాక్కవ్వాల్సిందే!

Balayya: ఈ సంక్రాంతికి నందమూరి బాలయ్య సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. బాలయ్య, శృతి హాసన్ జంటగా వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరో నాలుగు వారాల్లో ఈ సినిమా విడుదల అవ్వనుంది. జనవరి 12వ తేదిన బాలయ్య ఫ్యాన్స్ పెద్ద పండగే అని చెప్పొచ్చు. ఈ సినిమా బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్ గా నిలవనుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య కూడా ఈ మధ్య మంచి ఊపు మీద ఉన్నాడని, ఈసారి భారీ హిట్టు కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

వయస్సు పెరిగే కొద్దీ బాలయ్యలో మంచి ఎనర్జీ కనిపిస్తోంది. ఆయన యాక్టీవ్ నెస్ కు అందరూ ఫిదా అవుతున్నారు. బాలయ్యలో ఊపు వస్తోందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా నుంచి ఇటీవలె విడుదలైన సుగుణ సుందరి పాటలో బాలయ్య స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ పాటలో హీరోయిన్స్ తో కలిసి ఆయన వేసిన డ్యాన్స్ అదిరిపోయింది.

 

62 ఏళ్ల వయసులో బాలయ్య ఇంత ఎనర్జీగా డ్యాన్స్ వేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డ్యాన్స్ విషయంలో బాలయ్య కుర్ర హీరోలతో పోటీపడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ బాలయ్య ఎనర్జీ యమ స్ట్రాంగ్ గా మారుతోందని అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఆయన స్టెప్పులకు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. జై బాలయ్య అంటూ ఆయనకు జేజేలు పలుకుతున్నారు.

 

వీరసింహారెడ్డి మూవీ అఖండ కన్నా భారీ హిట్ అందుకోవాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఎనర్జీ అన్ స్టాపబుల్ అని కొందరు అంటుంటే మరికొందరు శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ కు ఏం కావాలో అది ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయని, బాలయ్య, థమన్ కాంబోలో ఈసారి ప్రేక్షకులు అస్సలు నిరుత్సాహపడరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య మాట తీరుకు, ఆయన వేసే స్టెప్పులకు, ఆయన ఈ వయసులో కూడా ఉన్న ఎనర్జీ లెవల్స్ కు ఫ్యాన్స్ గర్వపడుతున్నామని అంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -