Balayya: పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న బాలయ్య.. ఏమైందంటే?

Balayya: బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరిచిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా NBK 108 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ శ్రీలీల ఇద్దరు హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఇదివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణకు సినిమా టైటిల్ విషయంలో కాస్త సెంటిమెంట్ అనే విషయం మనకు తెలిసిందే.

 

ఈ మధ్యకాలంలో బాలకృష్ణ నటించిన సినిమాలన్నింటికీ కూడా టైటిల్లో సింహం అని వచ్చేలాగా టైటిల్స్ పెడుతున్నారు.ఇలా టైటిల్ లో సింహ అనే పేరు ఉంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న సెంటిమెంట్ అందరిలోనూ ఉంది.ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకి కూడా సింహ వచ్చే లాగే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం.

 

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ పెట్టబోతున్నారని సమాచారం. ఇందులో కేసరి అంటే సింహ అని అర్థం వస్తుంది. సింహాన్ని హిందీలో కేసరి అని పిలుస్తారు. అందుకే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ లో కూడా సింహ అని రావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీ ప్రకటించబోతున్నారని సమాచారం.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -