Bro Movie: బ్రో మూవీ కలెక్షన్ల కంటే బాలయ్య మూవీ కలెక్షన్లు ఎక్కువా.. ఏమైందంటే?

Bro Movie: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్రో. అయితే ఈ సినిమా విడుదలకు ముందునుంచే సినిమా గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాపై బ‌జ్‌ తక్కువగానే ఉంది. ఫ్యాన్స్ హంగామా తప్పితే బ్రో సినిమా చూడాలన్న కోరిక ఆత్రుత అభిమానులు ప్రేక్షకులలో కనిపించడం లేదు. కామన్ ఆడియన్స్ లో ముందు నుంచి పెద్దగా హైప్‌ లేదు. దీనికి తోడు పవన్ నుంచి వరుసగా మూడో రీమేక్‌ సినిమా కావడంతో చాలామందిలో ఆసక్తి లేదు.

ఇక ఓవర్సీస్ లోను ఇదే విష‌యం క్లియర్ గా తెలిసిందే. అయితే ప్రీమియర్ షో లతోనే అక్కడ బ్రోకు అంత సీన్ లేదని అర్థమైంది. ప్రీమియర్స్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది అనుకున్న బ్రో ఆదిపురుష్‌ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇంకా చెప్పాలంటే బాలయ్య వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌ సినిమాలు కంటే బాగా వెనకబడిపోయింది. ఈ ఏడాది యూఎస్ లో టాప్ 5 ప్రీమియర్ వసూళ్లలో ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాదే అగ్రస్థానం. ఈ సినిమా ప్రీమియర్స్ తోనే అక్కడ మిలియన్ డాలర్ల క్ల‌బ్‌లోకి చేరింది. ఆ తర్వాత ఏడు లక్షల డాలర్లకు పైగా వసూళ్ల‌తో బాలయ్య వీర సింహారెడ్డి రెండో స్థానంలో నిలిచింది.

 

ఇక సంక్రాంతికే వచ్చిన చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌ సినిమా ఆరు లక్షల డాలర్లతో మూడో స్థానంలో ఉంది. పవన్ బ్రో 6.4 లక్షల డాలర్లు వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంటే నాని దసరా సినిమా 6.3 లక్షల డాలర్లతో ఐదు స్థానంలో ఉంది. దీనిని బట్టి బాలయ్య, చిరు సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా బ్రో సినిమాకు లేదని తేలిపోయింది. దీంతో బ్రో సినిమా కంటే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు నయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -