Bro Disaster: బ్రో డిజాస్టర్ రిజల్ట్ తో పవన్ కళ్యాణ్ కు జ్ఞానోదయం.. ఆ విధంగా చేయబోతున్నారా?

Bro Disaster: భారీ అంచనాలతో రిలీజ్ అయిన బ్రో మూవీ మొత్తానికి పెద్ద డిజార్డర్ ని మూట కట్టుకుంది. దీంతో పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. తన కెరీర్ ని మళ్లీ దారిలోకి తేవాలంటే త్రివిక్రమ్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా తానే ఓన్ గా తీసుకోవాలి అనుకున్నాడో ఏమో కానీ చిన్న షెడ్యూల్ చేసి పక్కన పెట్టేసిన తేదీ రీమేక్ మూవీ ఉస్తాద్ సినిమాను మళ్ళీ బయటికి తీయించారు పవన్ కళ్యాణ్.

ఇన్ని రోజులు త్రివిక్రమ్ మీద డిపెండ్ అయ్యారు పవన్ కళ్యాణ్. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్లానింగ్ ల గురించి అంతా త్రివిక్రమ్ చేతిలో పెట్టారు. అయితే త్రివిక్రమ్ ఫార్ములా అయిన సూక్ష్మంలో మోక్షం అంతగా పవన్ కళ్యాణ్ కెరియర్ కి వర్క్ అవుట్ అయినట్లుగా కనిపించలేదు అనిపించడానికి బ్రో మూవీ రిజల్ట్స్ సాక్ష్యం. తక్కువ రోజులు పనితనం ఎక్కువ పారితోషకం అనే సూత్రం వికటించడంతో తన కెరియర్ పై మరింత దృష్టి సారించాడు పవన్ కళ్యాణ్.

 

సినిమాకి ఎన్ని వర్కింగ్ డేస్ అవసరమో షెడ్యూల్ వేసి ఇవ్వమని అర్జెంటుగా మైత్రి మూవీ మేకర్స్ కి కబురు పంపించాడు. వారు ఒక పాట మినహా 60 రోజులు అవసరం అవుతాయని లెక్క కట్టారు. వారు చెప్పిన లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ గట్టిగా కష్టపడితే ఆ సినిమాని ఈ సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

 

వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిన మాట వాస్తవమే. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తన కెరియర్ పై దృష్టి పెట్టకపోతే పరిస్థితులు మరోలాగా మారే అవకాశం ఉంది. ఎన్నికల ముందు జనాలని ఎంటర్టైన్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఒక మంచి హిట్ మూవీ కావాలి అందుకే త్రివిక్రమ్ సెట్ చేసిన బ్రో సినిమా లాంటిది కాకుండా ఆయన దృష్టి ఉస్తాద్ మీదికి మళ్ళింది. మొత్తానికి బ్రో సినిమా డిజార్డర్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి మంచి చేస్తుందనే అనిపిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -