BRO Movie: బుల్లితెరపై బ్రో మూవీ అట్టర్ ఫ్లాపా.. ఆ రేటింగ్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

BRO Movie: ఈ మధ్యకాలంలో ఓటీటీ లు వచ్చిన తర్వాత పెద్ద సినిమాల మరియు చిన్న సినిమాల యొక్క శాటిలైట్ మార్కెట్‌ దారుణంగా పడిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతం బుల్లితెరపై స్టార్‌ హీరోల సినిమాలు డైలీ సీరియల్స్ కంటే కూడా తక్కువ రేటింగ్ ను నమోదు చేసుకోవడం అన్నది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఒకప్పుడు 25 కి పైగా రేటింగ్ ను దక్కించుకున్న తెలుగు సినిమాలు ఇప్పుడు పది నుంచి పదిహేను రేటింగ్‌ ను దక్కించుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి సమయంలో వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ బ్రో సినిమాను జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా టెలికాస్ట్‌ చేసింది.

బ్రో సినిమాకు వచ్చిన రేటింగ్‌ చేసి ఛానల్ వారితో పాటు ఫ్యాన్స్ కూడా అవాక్కవుతున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇటీవల జీ తెలుగులో ప్రసారం అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల బ్రో సినిమాకు 7.24 రేటింగ్‌ నమోదు అయిందట. ఆ మధ్య వచ్చిన బీమ్లా నాయక్ సినిమా దాదాపుగా 9 రేటింగ్‌ ను దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు బ్రో సినిమా అంతకంటే తక్కువ రేటింగ్‌ ను నమోదు చేయడం ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చింది. బ్రో సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ రాలేదు. అలా అని ఫ్లాప్ టాక్ కూడా రాలేదు. ఎక్కువ శాతం మంది థియేటర్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై చూశారు.

కాబట్టి బ్రో సినిమాకి బుల్లితెరపై ఎక్కువ రేటింగ్‌ రాలేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. బ్రో సినిమాకు వచ్చిన రేటింగ్‌ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమాల శాటిలైట్‌ బిజినెస్ పై కచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే వెండితెరపై పర్వాలేదు అనిపించుకున్న బ్రో సినిమా బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్ గానే నిలిచిందని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -