Dementia: అందుకే చేతుల్లోంచి తరచూ వస్తువులు జారిపోతాయ్‌!

Dementia: నేటి కాలంలో వయస్సు భేదం లేకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఉద్యోగం, రోజువారి పనుల ఒత్తిడి, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, పౌషికాహార లోపంతో కొత్త కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. చేతుల ద్వారా కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అలాంటి దాన్ని ముందుగానే గుర్తించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మీ చేతులు పట్టు తప్పుతున్నట్లయితే కొన్ని రోజుల్లోనే అనారోగ్యానికి గురవుతున్నారన్న సంకేతంగా భావించాలి. మీ చేతుల్లోంచి తరచూ వస్తువులు జారి కిందపడిపోతుంటే నాడీ వ్యవస్థ, నరాల పటుత్వానికి సంబంధించిన అనారోగ్యానికి దగ్గరవుతున్నారని గ్రహించి వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవల వైద్య పరిశోధనలు ఈ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చాయి. సాధారణంగా ఇలా చేయి పట్టుచిక్కకపోవడాన్నీ, పట్టుజారిపోవడాన్ని ఎవరూ పెద్దగా సీరియస్‌గా పరిగణించరు. తరచూ చేతుల్లోంచి చిన్న చిన్న వస్తువులు కూడా జారి కిందపడిపోవడాన్ని కూడా ఎవరూ పట్టించుకోరు. కానీ అవన్నీ పూర్తిగా త్వరలోనే గుండె, మెదడు, నాడీ వ్యవస్థ, లేదా నరాల బలహీనతకు సంబంధించిన తీవ్రస్థాయి అనారోగ్యం కలగబోతోందన్న హెచ్చరికలట. శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలు, అనారోగ్యాలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు.

చేతులు పట్టు తప్పడం, జారిపోవడం త్వరలోనే మీకు చిత్త వైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాల్సి ఉంటుందని జర్నల్‌ ఆఫ్‌ అల్జీమర్స్‌లో ప్రచురితమైంది. ముప్పై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును అలవోకగా మోయగలుగుతాడు. దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది. ఈ సామర్థ్యం ఎంతో కొంత తగ్గినా సరే కచ్చితంగా అది రాబోయే రోజుల్లో కొని తెచ్చుకుబోయే అనారోగ్యానికి సంకేతమని వైద్యులు సూచిస్తున్నారు. చేతుల్లో పట్టు చిక్కడం మొత్తంగా శారీరక, మానసిక ఆరోగ్యానికి సూచనలని అమెరికాలో జరిగిన వైద్య పరిశోధనల్లో తేలింది.

వ్యాయామం చేస్తే..
దాదాపుగా ప్రతి మనిషికే ఒక దశాబ్దానికి 3–5 శాతం మజిల్‌ మాస్‌ పవర్‌ తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని మిగతా అవయవాల పటుత్వం కోసం రోజూ వ్యాయామం చేసేవాళ్లే తప్ప చేతుల్లోని, మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసేవాళ్లు సంఖ్య పెద్దగా కనిపించదని నిపుణులు అంటున్నారు. కేవలం చిన్న చిన్న రెప్పులు, స్మైలీ బాల్స్‌ సాయంతో రోజు కొంచెసేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరచుకునేందుకు వ్యాయామం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -