High Blood Pressure: అధిక రక్తపోటుకు తల్లిదండ్రులు కూడా కారణమేనా?

High Blood Pressure: హైపర్ టెన్షన్‌ని ఆర్టరీస్‌లో ‘అధిక రక్తపోటు’గా పరిగణిస్తారు. అధిక రక్తపోటు ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైంది. ఆరోగ్యం, ఫిట్‌గా ఉన్నవారిపై కూడా హైబీపీ ప్రభావం పడుతుంది. హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న తల్లిదండ్రుల నుంచి తమ పిల్లలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. దీనివల్ల పిల్లలకు కూడా హైపర్ టెన్షన్ కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని జెన్స్2మి వ్యవస్థాపకుడు నీరజ్ గుప్తా అన్నారు. ఈ మేరకు ఒక పరిశోధనను చేపట్టారు. ఈ పరిశోధనలో హైపర్ టెన్షన్‌పై వంశపారంపర్యం వల్ల 20 నుంచి 55 శాతం వరకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం సేవించడం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు మెడికల్ చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు పిల్లలకు జన్యుపరమై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే హైపర్ టెన్షన్ కూడా మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చే ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ చెకప్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా ఫ్యామిలీ డాక్టర్‌కి చూపించి చెకప్ చేసుకోవాలి. అలాగే జెనిటిక్ ప్రిడిస్ పొజిషన్ టెస్ట్ చేయించుకోవాలి. దీంతో జన్యు సంబంధిత సమస్యల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలను చేయించుకున్నట్లయితే ప్రమాద స్థాయి గురించి తెలుస్తుంది. దీంతో సులభంగా వైద్య చికిత్స చేసుకునే అవకాశం ఉంది.

ఈ పరీక్షలో మీకు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే మీరు హార్ట్ హెల్దీ బిహేవియర్స్ తో సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీకు హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచే జన్యువు ఉన్నప్పటికీ.. రోజు ఆరోగ్యకరమైన భోజనం, వ్యాయామం చేస్తుండాలి. పెద్దవాళ్లు ధూమపానానికి దూరంగా ఉండాలి. అలాగే వంటల్లో ఉప్పు, కారం తగ్గించాలి. వీటిని తగ్గించినట్లయితే వారసత్వంగా వచ్చే సమస్యలన్నింటిని దూరం చేయవచ్చు. హైపర్ టెన్షన్ బారిన పడిన వారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ జాగ్రత్తలు పాటించేటప్పుడు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. అనారోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్న వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -