Heart-Healthy Diet: వీటిని తింటే గుండె జబ్బులకు చెక్‌ పెట్టవచ్చు!

Heart-Healthy Diet: ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వివిధ రకాల పౌష్టికాహారాలు, ఔషధాలు వాడుతుంటారు. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు ఉబకాయం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధన వెల్లడించింది. బ్రిటన్‌లో గుండెజబ్బులకు గురైన 4,20,000 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు చేసిన పరిశోధనలో శాకాహారులు గుండె సంబంధ వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువని నిర్ధారించారు.

పెస్కటేరియన్ డైట్‌ను ప్రోత్సహించడంతో గుండె జబ్బుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. శాకాహారులు, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం తినేవారు గుండె జబ్బుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఎంత వరకు ఉందనే వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. ఇతరులతో పోలిస్తే మాంసం ఎక్కువగా తినేవారిలో 94. 7 శాతం మంది ఊబకాయం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. మాంసం ఎక్కువగా తినేవారితో పోలిస్తే చేపలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకునేవారు హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఇతర గుండె సంబంధ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు పండ్లు, కూరగాయలు, ఫైబర్, మంచి కొవ్వులు, నీరు అధికంగా లభించే పదార్థాలకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు.

మాంసాహారానికి బదులుగా పెస్కటేరియన్ డైట్ ( చేపలు మాత్రమే తినేవారు)ని ప్రోత్సహించాలని గ్లాస్గో యూనివర్సిటీ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు జిల్ పెల్ పేర్కొంటున్నారు.చేపలు ఎక్కువగా తినేవారికి పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇవి గుండె జబ్బులను సమర్థంగా ఎదుర్కోగలవు. వీటిల్లో ఉండే ఎన్‌-3 కొవ్వులు ఇలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయని పరిశోధకులు వెల్లడించారు. పెస్కటేరియన్ డైట్‌ను పాటించేవారు గుండె జబ్బులు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం తక్కువని వారి పరిశోధనలో వెల్లడైంది. మాంసం వినియోగాన్ని తగ్గించడంతో పర్యావరణానికి మేలుతో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -