Health Tips: ఈ ఆహార పదార్థాలను తింటే గుండె సేఫ్ గా ఉంటుందని తెలుసా?

Health Tips: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది గుండె సంబంధిత కారణాల వల్ల మరణిస్తున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలు రావడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణం అని చెప్పవచ్చు. అందులో మనం తీసుకునే ఆహారం కూడా ఒకటి. అయితే గుండె సమస్యలు రాకుండా సేఫ్ గా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందుకోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఓట్స్ కూడా ఒకటి. ఉదయాన్నే ఓట్స్ తో చేసిన బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా లభిస్తాయి. దాని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడ‌తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు కూడా రావు. మరి ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారికి ఓట్స్ చాలా బాగా ఉపయోగయపడ‌తాయి. ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ , ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. వీటితోపాటుగా విటమిన్స్, మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్లాంట్ కాంపౌండ్స్ హెచ్చుగా ఉంటాయి. ప్రాసెస్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతేకాదు ఈజీగా ఆహారంగా తయారుచేసుకోవచ్చు. ఓట్స్ ను తీసుకోవటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల తొందరగా ఆకలి వేయదు.

 

ఓట్స్ ను రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండు చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. దాంతో జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు. అధిక బరువు సమస్య లేకుండా చేస్తాయి. అధికబరువు సమస్య ఉన్న వారికి ఓట్స్ మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఓట్స్ చాలా మంచివి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఆస్తమా ఉన్నవారిలో కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఓట్స్‌లో విటమిన్ బి సహజంగా లభిస్తుంది. కార్పోహైడేట్లు, ప్రోటీన్స్, మినరల్స్ సమృద్దిగా లభిస్తాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -