Health Tips: ఈ ఆహారాలు తింటే గుండె సమస్యలు గ్యారంటీ.. ప్రాణాలు ప్రమాదంలో పడతాయంటూ?

Health Tips: మనం శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం మన గుండె. ఇది శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేయటానికి పనిచేస్తుంది. అటువంటి గుండె ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం. అయితే మనకి ఉండే కొన్ని అలవాట్లు గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి అలవాట్లని మంచి ఆహార నియమాలను కలిగి ఉంటే ఆ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే ఆ ప్రభావం గుండెపై పడుతుంది.

ఎక్కువగా ఫ్రైడ్ మీట్ అలాగే రెడ్ మీట్ తింటూ ఉంటారు అయితే ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. వేయించిన చికెన్ కాల్చిన చికెన్ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటుంది. మీ హృదయం ఆరోగ్యం గా ఉండాలి అనుకుంటే ఫ్రైడ్ చికెన్ కన్నా గ్రిల్ చికెన్ బెటర్. అలాగే స్వీట్స్ అంటే ఇష్టపడిన వాళ్లు ఉండరు. అయితే అధిక మొత్తంలో స్వీట్స్ తినటం వలన శరీరంలో చక్కెర నిల్వలు పెరిగిపోయి కొవ్వు పెరిగిపోతుంది.

దీని వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు తినే బ్రెడ్ వైట్ ది కాకుండా బ్రౌన్ ది ఎక్కువగా ఉపయోగించండి. ఎందుకంటే వైట్ బ్రెడ్ లో ఫైబర్, ఖనిజాలు, ఫైటో కెమికల్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పటి పిల్లలకి బెస్ట్ స్నాక్స్. అయితే ఇది గుండెకు మూడు రెట్లు ఎక్కువ ప్రమాదకరం. మీ రక్తంలో చక్కెరను స్థాయిని పెంచే సాధారణ కార్పొరేట్లను కలిగి ఉంటుంది.

అదనంగా వాటిలో కొవ్వు మరియు ఉప్పు కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి గుండెకు హాని కలిగిస్తాయి. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాలు, హాట్ డాగ్ లు సలామీ వంటివి మీ హృదయానికి నష్టం కలిగించే మాంసాలు. అలాగే డైట్ డ్రింకులు కూడా బరువు పెరగడానికి, హార్ట్ స్ట్రోక్ లకి కారణం అవుతాయని ఇప్పటికే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది లేదంటే మన ప్రాణానికి ప్రమాదమే.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -