IRCTC Tatkal Trains Booking: తత్కాల్ రైలు టికెట్లు సులువుగా బుక్ కావాలా.. ఫాలో కావాల్సిన చిట్కాలివే?

IRCTC Tatkal Trains Booking: పండుగ రోజులలో చాలామంది ఉద్యోగులు తమ సొంత ఊరికి వెళ్లి తమ కుటుంబ సభ్యులతో పండగ జరుపుకోవాలాని అనుకుంటారు. అలాంటి రోజులలో రైలు టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేసుకోవడానికి వీలు పడనంత రద్దీ ఉంటుంది. అలాంటప్పుడు అప్పటికప్పుడు టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది.

అయినా కూడా టికెట్లు బుక్ అవుతాయో లేదో తెలియదు. మీరు తత్కాల్ రైలు టిక్కెట్లను బుక్ చేసుకున్నప్పటికీ, ఆ టికెట్ బుక్ అయిందో లేదో ఏలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.ఐఆర్‌సీటీసీ నుండి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు మీ ప్రొఫైల్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.ఇలా చేయడం వల్ల టికెట్ ను బుక్ చేసేటప్పుడు అన్ని వివరాలను పూర్తి చేయవలసిన అవసరం ఉండదు.

దీనికోసం ముందుగా ఐఆర్సీటీసీ సైట్‌కి లాగిన్ అయినా తర్వాత, మై ప్రొఫైల్ ఎంపికకు వెళ్లి, మాస్టర్ జాబితాను సృష్టించండి. దీనిలో ప్రయాణికులందరి వివరాలను నమోదు చేయండి. దీని వల్ల మీ సమయం వృధా కాకుండా టికెట్లు త్వరగా బుక్ అయ్యే అవకాశం ఉంది.

టికెట్ బుకింగ్ సమయం గురించి సమాచారాన్ని సేకరించి,ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. బుకింగ్ ప్రారంభమయ్యే ముందు సైట్‌కి లాగిన్ చేసి బుకింగ్ ప్రారంభమైన వెంటనే వివరాలను నమోదు చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పటికే మాస్టర్ జాబితాను సిద్ధంగా కలిగి ఉన్నారు, కాబట్టి ప్రయాణీకుల వివరాలను నమోదు చెయ్యగానే సేవ్‌ అవుతాయి.

మాస్టర్ జాబితాను ఎంపిక చేసిన వెంటనే, ప్రయాణికులందరి వివరాలు ఆటోమేటిక్‌గా సేవ్ అయిన తర్వాత, చివరిగా టికెట్ కోసం నగదు చెల్లించే ఆప్షన్‌ పై క్లిక్ చేయండి. మీరు ఇతర చెల్లింపు మోడ్‌ల ద్వారా నగదు చెల్లించకుండా UPI ద్వారా డబ్బును చెల్లించడం మంచిది. చెల్లింపు చేసిన వెంటనే, మీ బుకింగ్ వేగంగా పూర్తవుతుంది. దీనివల్ల టికెట్ బుక్ అయ్యే అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఈ మాస్టర్‌ జాబితాను పూర్తి చేయడం వల్ల తాత్కల్‌ టికెట్ల సమయంలో పూర్తి వివరాలు అదే తీసుకుంటుంది. దీని వల్ల సమయం ఆదా అయి మీ టికెట్స్‌ బుక్‌ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -