Zomato Boards The IRCTC Train: జొమాటోతో ఐఆర్సీటీసీ భాగస్వామ్యం.. రైలు ప్రయాణం చేసేవాళ్లకు శుభవార్త అంటూ?

Zomato Boards The IRCTC Train: రైల్వే ప్రయాణికులు ఇకపై భోజనానికి ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఐఆర్ సిటిసి ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణ సమయంలో ఆహారం అందించేందుకు జొమాటో తో ఒప్పందం కుదుర్చుకుంది ఐఆర్ సిటిసి. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఆహార సరఫరా విషయంలో మరిన్ని ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాటరింగ్ సిగ్మెంట్లో ప్రయాణికులు ముందుగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను తెప్పించేందుకు ఫుడ్ డెలివరీ ఆప్ జొమాటో తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా తొలుత 5 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రైల్వే స్టేషన్లకు మాత్రమే ప్రాథమికంగా జొమాటో సేవలను పరిమితం చేసింది. న్యూఢిల్లీ, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి ఈ ఐదు రైల్వే స్టేషన్లో మాత్రమే జొమాటో ప్రస్తుతానికి తన సేవలు వినియోగిస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషనులకు జొమాటో సేవలు విస్తరించే అవకాశం ఉంది. ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం కల్పించింది. ఆహారం అందించడం విషయంలో ప్రయాణికులకు ఎక్కువ ఆప్షన్లను అందించడంలో భాగంగానే జొమాటో అనుసంధానం అయినట్లు తెలిపింది ఐఆర్సిటిసి.

పండగ సీజన్ కావడంతో రైల్వే క్యాటరింగ్ సర్వీస్ ప్రత్యేక సేవలు ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసేవారి కోసం ఇండియన్ రైల్వే ప్రత్యేక థాలిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో జొమాటో షేర్ ప్రైస్ ఆరంభం రోజున 52 వారాల గరిష్టానికి 115 రూపాయల వద్దకు చేరింది. దీంతో అమ్మకాలు తగ్గిపోయి నష్టాలలోకి వెళ్ళిపోయింది.

మరొకవైపు ఐఆర్సిటిసి షేర్ కూడా రెండు శాతం నష్టాల్లో కొనసాగుతుంది. గరిష్టంగా 700 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ విషయం పక్కన పెడితే వాట్సాప్ లో జూబ్ చాట్ బోట్ సర్వీస్ ద్వారా ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో సులభంగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ట్రైన్ లో ఉన్నప్పుడు ఈ జూపు సర్వీస్ ని వినియోగించుకుని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే తర్వాత స్టేషన్లో ఫుడ్ డెలివరీ వస్తుంది. ఇందుకోసం అదనంగా వేరే యాప్ అవసరం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -