Railway Food: రైళ్లలో తినే రైల్వే ఫుడ్ ఎలా చేస్తారో తెలిస్తే మాత్రం దండం పెడతారు!

Railway Food: ఒకప్పుడు బయట భోజనం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా రకరకాల భోజన పదార్థాలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా ప్రయాణంలో కూడా భోజనాలు ముందుకు వస్తున్నాయి. అటువంటి సదుపాయాలు రైల్వేలలో, విమానాలలో అందుబాటులో ఉన్నాయి.

అయితే రైల్వేలలో, విమానాలలో దొరికే ఫుడ్ ను వెంటనే తినేస్తున్నాం కానీ.. అది ఎలా తయారు చేస్తున్నారు.. ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అనేది ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. కేవలం ఆ సమయానికి ఫుడ్ దొరికితే చాలు అన్నట్లుగా ఉంటున్నారు. అయితే తాజాగా రైల్వేలో ఫుడ్ ఎలా చేస్తారో అన్న విషయం బయటపడింది.

 

ఐఆర్సిటిసి తో పాటు దాని అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న సెంట్రల్ మెగా కిచెన్ లో ఒకటైన నోయిడా కిచెన్లో రోజుకు 10000 భోజనాలు సిద్ధమవుతాయని తెలిసింది. కేవలం రైళ్లకే కాకుండా పలు కార్పొరేట్ సంస్థలకు కూడా అక్కడి నుంచే ఆహారాన్ని అందిస్తారని తెలిసింది. నాలుగు అంతస్తులు ఉన్న ఆ కిచెన్ లో రోజుకు 10000 భోజనం, 6000 స్నాక్ ప్యాకెట్లు తయారు చేస్తారట.

 

వచ్చిన ఆర్డర్లను సరఫరా చేయటానికి దాదాపు 160 మంది పనిచేస్తారట. అది కూడా రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారట. ఇక అందులో 67 మంది కిచెన్ లో ఉండగా మిగతా వాళ్లంతా ఆర్డర్లను సరఫరా చేస్తారట. ఇక ఉదయం 4.30 గంటలకే అల్పాహారాన్ని తయారుచేసి.. ఆ తర్వాత 6.30 గంటలకు కూరలు వండి సిద్ధంగా పెడతారట.

 

అయితే ఇక్కడ పనులు వేగంగా పూర్తి కావడానికి యూరోపియన్ మెషిన్లు వాడతారని తెలిసింది. కూరగాయలు ముక్కలు చేసేందుకు, బియ్యం, పప్పును ఉడికించేందుకు అక్కడ కొన్ని రకాల మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిసింది. అంతేకాకుండా చపాతీలు చేయడానికి కూడా ఒక డౌ మేకర్ అందుబాటులో ఉంటుందని తెలిసింది. ఆ మనిషిని పిండిని కలిపి బంతులుగా చేసి ఆ తర్వాత చపాతీలను చేసి అందిస్తుందట.

 

ఈ మిషన్లన్నీ ఆపరేటర్లు నిర్వహిస్తారు. ఇదే కాకుండా బ్రెడ్, శాండ్విచ్ తయారు చేయడానికి కూడా మిషన్ లు ఉన్నట్లు తెలిసింది. ప్యాకింగ్ చేయడానికి కూడా ప్రత్యేక యంత్రం ఉందని తెలిసింది. ఇక తయారుచేసిన ఆహార పదార్థాలు చెక్ చేసేందుకు ఒక ల్యాబ్ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక చేసిన దానిలో ఏదైనా తప్పు కనిపిస్తే మొత్తం బ్యాచ్ ను వెంటనే రీ కాల్ చేస్తారని తెలిసింది. ఇక ప్రతి ఒక్క విషయంలో మంచి శుభ్రతతో కూడిన ఆహార పదార్థాలు అందిస్తారని తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -