IRCTC GST: 1,025 రూపాయల బిల్లుకు 660 జీఎస్టీ.. మోదీ పాలన ఇంత ఘోరంగా ఉందేంటి బాస్!

IRCTC GST: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కదానిపై జీఎస్టీ ని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. వంద రూపాయల వస్తువు నుంచే ఈ జీఎస్టీని ఇస్తున్నారు. ఒక సినిమాకి వెళ్లాలన్నా, ఎక్కడికైనా టూర్లకు వెళ్లాలన్నా, ఏదైనా రెస్టారెంట్లకు వెళ్లాలి అన్న ఎక్కడ చూసినా కూడా జీఎస్టీ పేరుతో బిల్లులు మోతమోగుతున్నాయి. ఇలా ప్రతిదానిపై జీఎస్టీ విధిస్తూ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోంది. నిన్న లోక్ సభలో ఆన్ లైన్ గేమింగ్ పై జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆన్ లైన్ గేమ్స్ ఆడేది సంపన్నులే కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ సామాన్యుడికి షాక్ ఇచ్చేలా అన్ని వస్తువుల పై నిత్యావసరాల పై కూడా జీఎస్టీ విధిస్తున్నారు. మొదట విలాసాలకే జీఎస్టీ విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుండి మళ్లీ పడుకునే వరకూ ఏదో ఒక రూపంలో ప్రజల నుండి స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అంటూ వసూలు చేస్తోంది. ఇక తాజాగా మన దేశంలో ఏ రేంజ్ లో జీఎస్టీ వసూలు చేస్తున్నారో అర్థం అయ్యేలా ఓ బిల్లు వైరల్ అవుతోంది.

 

పూరి ముంబై ఎల్ టీ టీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో ఓ వ్యక్తి ప్రయాణించాడు. అతడికి ఆకలి వేయడం తో ప్రయాణం మధ్యలో రూ. 1025 విలువ చేసే ఫుడ్ ను ఐఆర్సీటీసీలో ఆర్డర్ చేశాడు. కాగా ఆ ఫుడ్ కు రూ. 660 రూపాయల జీఎస్టీ వసూలు చేశారు. అంతే దాదాపు 65 శాతం జీఎస్టీ పడింది. బిల్లు చూసిన తరవాత ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆ బిల్లును ఫోటో తీసి రైల్వే అధికారులకు, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ బిల్లు మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో అసలు బిల్లు కంటే జీఎస్టీ నే ఎక్కువ వేశారు కదా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయినా తినే ఫుడ్ పై కూడా జీఎస్టీ ఏంటి? అంటూ కేంద్ర ప్రభుత్వం పై మండిపడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై నెటిజన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు ‘

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -