Bharti-Brahmani: భారతి, బ్రహ్మణి చుట్టూ ఏపీ పాలిటిక్స్.. రెచ్చకెక్కిన ఫ్యామిలీ పాలిటిక్స్

Bharti-Brahmani: ఏపీ రాజకీయాలు మరింత రచ్చకెక్కాయి. మాటల తూటాలను అని కూడా కాకుండా తారాస్థాయికి ఏపీ పాలిటిక్స్ చేరుకున్నాయి. చివరికి ఫ్యామిలీలోని మహిళలను కూడా రాజకీయ రోచ్చులోకి లాగుతున్నారు. ఫ్యామిలీలోని ఆడవాళ్లను టార్గెట్ చేసి మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ ధోరణీ ఎప్పటినుంచో సాగుతూ ఉంటుంది. రాజకీయాలతో సంబంధం లేని మహిళలను కూడా లాగుతూ నీచ రాజకీయాలు చేస్తున్నాయి పార్టీలు. ఏపీలో ఆ వింత పోకడకు అసలు చెక్ పెట్టడం లేదు. ప్రత్యర్ధిని మానసికంగా దెబ్బతీసేందుకు కుటుంబంలోని మహిళలపై విషప్రచారం చేస్తున్నారు.

తాజాగా మరోసారి ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ రంజుగా మారాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోకి జగన్ భార్య భారతి పేరును టీడీపీ తీసుకురాగా.. బ్రహ్మణి, భువనేశ్వరి పేర్లను వైసీపీ తీసుకొచ్చాయి. భువనేశ్వరిని కించపరుస్తూ కొడాలి నాని చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఏపీలో మంట రేపాయి. అది ముగియగానే.. ఇప్పుడు మరోసారి మహిళలను రాజకీయాల రోచ్చులోకి లాగారు. ఇటీవల వైసీపీ నేతలు డెక్కన్ క్రానికల్ కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్ చేసిన కథనాన్ని ప్రింట్లు తీసి విజయవాడలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు.

దీంతో వైసీపీకి కౌంటర్ గా టీడీపీ నేతలు భారతిని టార్గెట్ చేశారు. భారతి పే అంటూ పోస్టర్లను పలు ప్రాంతాల్లో అతికించారు. ఇటీవల కర్ణాటక సీఎం బొమ్మై ప్రతి ప్రాజెక్టులో 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ పేటీఎం తరహాలో పేసీఎం అంటూ బీేపీ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో భారతి పే అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. లిక్కర్ స్కాంలో భారతి ఉండటంతో..లిక్కర్ పేమెంట్స్ ఆమె తీసుకున్నారంటూ భారతి పే పోస్టర్లను వైరల్ చేస్తున్నారు.

ఇక భారతి పే పోస్టర్లపై వైసీపీ ఘాటుగా స్పందించింది. మహిళలను అవమానించివాళ్లు మాడి మపై పోవాల్సిందేనని వైసీపీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది. దేవీ నవరాత్రుల సమయంలో భారతి పే అంటూ విషప్రచారం చేస్తున్న టీడీపీకి త్వరలో సరైన గతి పుడుతుండటంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. అయితే వైసీపీ నేతలు కూడా ఎక్కడా తగ్గడం లేదు. నారా లోకేష్ భార్య బ్రహ్మణి పేరుతో క్యూఆర్ కోడ్ పోస్టర్లను వైరల్ చేస్తున్నారు. బ్రహ్మణి మిల్క్ అంటూ క్యూఆర్ కోడ్ పోస్టర్లను అతికిస్తున్నారు.

స్కాన్ దిస్ కోడ్ టూ మేక్ ద బ్రహ్మణి పే ఫర్ బ్రహ్మణి మిల్క్ అంటూ పలు ప్రాంతాల్లో వైసీపీ పోస్టర్లు అతికిస్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో భారతి పే, బ్రహ్మణి మిల్క్ పోస్టర్లు వైరల్ గా మారాయి. బ్రహ్మణి మిల్క్ పోస్టర్లపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని మహిళలను ఇందులోకి లాగడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -