YS Jagan : కడపలో జగన్ కు షాక్.. టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా కీలక నేత

YS Jagan : సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలోనే వైసీపీకి చెక్ పెట్టాలని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చంద్రబాబు సొంత కోట అయిన కుప్పంలో బాబును ఓడించేందుకు జగన్ ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మున్నిపల్ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీని ఓడించిన వైసీపీ.. ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవకర్గమైన కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే టార్గెట్ గా జగన్ పావులు కుదుపుతున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన జగన్.. వైసీపీ నేతలకు కీలక సూచనలు చేశారు.

కుప్పంలో వైసీపీని గెలిస్తే వైసీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు అడిగితే వెంటనే మంజూరు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని, అందరూ సమిష్టిగా శ్రమించి వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. కుప్పం నేతలు ఎవరైనా అభివృద్ధి పనుల నిధుల కోసం తనతో డైరెక్ట్ గా మాటడవచ్చని సూచించారు. సొంతగడ్డలోనే చంద్రబాబుకు చెక్ పెట్టి దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ కుప్పంలో చంద్రబాబును ఓడించడం అంత సులువైన పని కాదు.. అక్కడ నుంచి చాలా సంవత్సరాలుగా చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు.

అయితే కుప్పంపై జగన్ ఫోకస్ పెడుతున్న క్రమంలో జగన్ సొంతగడ్డ అయిన కడప జిల్లాలో వైసీపీని ఓడించి వీలైనన్నీ మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో కడప టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా బలమైన నేతలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్.శ్రీనివాసులరెడ్డిని పోటీలోకి దింపాలని టీడీపీ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.

వ్యాపారవేత్త కావడంతో ఆర్ధికంగా కూడా ఆయనకు బలం ఉండటంతో పాటు అంగబలం కూడా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కడప టీడీపీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్దంగా ఉండాలని శ్రీనివాసులరెడ్డికి చంద్రబాబు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కడపలో ఆయనకు మంచి పేరుంది. కార్యకర్తలకు అందుబాటులో ఉంటారనే పేరు కూడా ఉంది. పార్టీ కార్యక్రామల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. కడప లోక్ సభ ఎన్నికల పరిధిలోని పులివెందులతో పాటు అన్ని నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డిక బంధువులు ఉన్నారు. దీంతో శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వనున్నారు.

2014 ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ తరపున ఆర్.శ్రీనివాసులురెడ్డి పోటీ చేసి అవినాష్ రెడ్డిపై ఓడిపోయారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీకి 5 లక్షల ఓట్లు వచ్చాయి. కడప లోక్ సభ సీటు అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని ఎవరైనా చెబుతారు. ప్రస్తుతం వైసీపీ తరపున వైఎస్ అనినాష్ రెడ్డి ఉన్నారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి, 2009, 2012 ఎన్నికల్లో సీఎం జగన్ ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1984 ఎన్నికల్లో కడప ఎంపీ సీటును టీడీపీ గెలుచుకోగా.. 1996 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాడో పోరాడి ఓడింది.

కడప లోక్ సభ పరిధిలోని టీడీపీకి బలం బాగానే ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆ కేసులో వైఎష్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై ఆరోపణలు రావడంతో ప్రజల్లో కాస్త వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను తమ వైపుకు తిప్పుకుని వచ్చే ఎన్నికల్లో కడపలో జెండా ఎగురువేయాలని టీడీపీ బావిస్తోంది. అవినాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ ఎంపీ అభ్యర్ధిగా కాకుండా జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -