Bigg Boss 6 Nominations List: బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్ లిస్ట్ ఇదే.. ఈసారి ఏకంగా ఎనిమిది మంది!

Bigg Boss 6 Nominations List: తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఉంటుందా పోతుందా అనుకుంటూ తెలుగులో స్టార్ట్ చేసిన ఈ షో ప్రస్తుతం భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇలా ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ప్రస్తుతం ఆరో సీజన్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. ఇక ఈ షోలో అత్యంత ముఖ్యమైన నామినేషన్ ప్రక్రియ రెండో వారంలో ఎలా జరుగుతుంది.

ఇందులో ఎంత మంది నామినేట్ అయ్యారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ షో లో నామినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఇక మొదటి వారం ఎలిమినేషన్స్ లేకపోవడంతో ఈసారి నామినేషన్ పై ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇక రెండో వారం నామినేషన్స్ ను సోమవారం పెట్టబోతున్నారు. ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ లో రెండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో ఏకంగా 8 మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది. వారిలో రేవంత్, పైమా అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్, రాజశేఖర్, షాని సాల్మన్, రోహిత్, మెరీనాలు ఎలివేషన్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక మొదటి వారంలో కెప్టెన్ అయిన బాలాదిత్య రెండోవారం లో సేఫ్ అయ్యాడు. ఇక మిగిలిన 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇక వీరిని మినహాయించి మిగిలిన వాళ్ళందరూ సేఫ్ అయినట్లు తెలుస్తుంది.

ఇకా బిగ్ బాస్ లో మరోసారి ట్విస్ట్ ఏమన్నా ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక రేవంత్, పైమా, అభినయశ్రీ లు వరుసగా రెండోవారం కూడా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇది బాగా ఆలోచించాల్సిన విషయం గా మారింది. ఇక బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి రెండవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియను కొత్తగా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ సిక్స్ మాత్రం ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -