Bigg Boss Season 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్?

Bigg Boss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని తెలియడంతో ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన సందడి నెలకొంది. నిత్యం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇకపోతే ఈ కార్యక్రమం ప్రసార తేదీ అన్ని తెలియడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లపై ఉందని చెప్పాలి.

ఇకపోతే కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ వచ్చేసిందని ఫైనల్ లిస్టులో కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ లిస్టులో ఉన్నటువంటి 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పటినుంచో వినిపిస్తున్న వారిలో సిరి ప్రియుడు శ్రీహాన్ ఒకరు. ఈయన సీజన్ సిక్స్ లో పక్కా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆదిరెడ్డి,జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ చలాకి చంటి ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. పటాస్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమైన ఫైమా, సింగర్ రేవంత్, లేడీ చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప పాల్గొనబోతున్నట్లు సమాచారం.

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదించుకుంటున్న నటి శ్రీ సత్య, వసంతి కృష్ణన్, టాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కళ్యాణ్, మాస్టర్ భరత్, యాంకర్ అరోహి రావ్, టీవీ9 యాంకర్ అంజలి, ఆర్టిస్ట్ సుల్తానా, యాంకర్ దీపికా పిల్లి, ట్రాన్స్ జెండర్ తన్మయి గీతు రాయల్, జబర్దస్త్ అప్పారావు వీరందరూ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వెళ్లబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -