AP Elections: ఏపీలో గెలుపు గుర్రం వైపు బీజేపీ.. సర్వేలో ఏం తేలుతుందో?

AP Elections:  ఏపీ ఎన్నికలపై బీజేపీ సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ సర్వేకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి.. టీడీపీ,జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయా.. జగన్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఎలా ఉంది.. అనే అంశాలపై ఏపీ బీజేపీ వర్గాలు సర్వే చేయిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీ బీజేపీ చేయించే ఈ సర్వే రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సర్వే ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేసుకుని ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది బీజేపీ నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు.

ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉంటే.. ఆ కూటమితో బీజేపీ కలిసే అవకాశాలున్నాయి. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏపీ బీజేపీ చేయించిన సర్వేలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తే ఆ పార్టీకి అనుకూలంగా బీజేపీ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏపీ బీజేపీలో ఏం తేలుతుంది.. ఆ సర్వే ఫలితాల తర్వాత రాజకీయ పరంగా ఏపీ బీజేపీ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా.. ఆ పార్టీ మద్దతు పార్టీలకు అవసరం. అధికారంలోకి రావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అన్ని పార్టీలకు అవసరంగా మారింది.

దీంతో టీడీపీ, జనసేనతో పాటు వైసీపీ కూడా బీజేపీ మద్దతును కోరుకుంటున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా అదే మాటను చెప్పారు. వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమని, ఆ పార్టీ పట్ల తనకు గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు. మోదీ, అమిత్ షాలతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ పవన్ చెప్పుకొచ్చారు. పార్టీలన్నీ బీజేపీ మద్దతను కోరుకుంటున్నాయంటూ చెబుతున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీకి బీజేపీ సమానదూరం పాటిస్తోంది. రెండు పార్టీలను వ్యతిరేకిస్తోంది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ చెబుతోంది. కానీ పవన్ మాత్రం బీజేపీకి దూరంగా జరుగుతున్నారు. బీజేపీ కలిసి రాకపోయిన సరే.. టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమవుతున్నారు.

దీంతో బీజేపీ కూడా తమ స్టాండ్ ను ఏటో ఒకవైపు తీసుకోవాలనే యోచనలో ఉంది. ఏదోక పార్టీకి తోకగా మారాలని బీజేపీ చూస్తోంది. ఈ సర్వేలో వచ్చే ఫలితాలను బట్టి బీజేపీ తన స్టాండ్ ను మార్చుకోనుంది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలపై బీజేపీ చేయిస్తున్న సర్వే కీలకంగా మారింది. గతంలో 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఆ తర్వాత రాష్ట్ర విభజన హామీలు నేరవేర్చకపోవడంతో బీజేపీ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోంది. జగన్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహాయం చేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తోంది. టీడీపీతో కూడా దూరం పాటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -