Bruce Lee: 49 ఏళ్ల తర్వాత బ్రూస్‌ లీ మృతికి గల కారణాలు బయటకు వచ్చాయి!

Bruce Lee: మార్షల్ ఆర్ట్స్ లెజెండ్‌ బ్రూస్ లీ అంటే తెలియని వారు ఉండరు. ఆయన పంచ్‌ వేస్తే కెమెరాకు కూడా చిక్కని వేగంతో ఉంటుందని అప్పుడు చెప్పుకునేవారు. ఆయనకున్న కొన్ని ప్రత్యేకతలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునేలా చేసుకున్న వీరుడు బ్రూస్‌ లీ. కాగా యవ్వనంలోనే బ్రూస్‌ లీ మృత్యువాత పడగా ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు జరిగాయి. హత్య అని కొందరు, కుట్ర అని కొందరు రకరకాల పుకార్లు వచ్చాయి. దాదాపు 49 ఏళ్ల తర్వాత బ్రూస్‌ లీ మరణానికి కారణం ఏంటో కనిపెట్టారు నిపుణులు. పరిశోధనల్లో వెల్లడైన విషయం ఏంటంటే బ్రూస్ లీ ‘సెరిబ్రల్ ఎడెమా/మెదడు వాపు వ్యాధి’తో ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

 

బ్రూస్‌లీ ఎంత మోతాదులో నీరు తీసుకునే వాడో అంతే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల హైపో నాట్రేమియాకు దారి తీసింది. బ్రూస్ లీ మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇది జరిగింది. ఇది కూడా అతని మరణానికి కారణమైందని పరిశోధకులు పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ చేసే సమయంలో లీ డైట్‌లో దాహాన్ని పెంచే జ్యూస్‌లు, ప్రోటీన్ డ్రింక్స్ బాగా తీసుకునేవారని నివేదికలో తేలింది. ఆయన శరీరంలోని సోడియంను తొలగించడానికి, కండరాలు మరింత పెరగడానికి ప్రయోగాలు చేసినట్లు తెలిపారు.

 

శవ పరీక్ష సమయంలో బ్రూస్‌ లీ మెదడు 1,575 గ్రాముల వరకు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1,400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. ఈ వాపు కారణంగానే బ్రూస్‌ లీ చనిపోయాడని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాక కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా బ్రూస్‌ లీని వేధించాయని, అది కూడా అతను చనిపోవడానికి ఓ కారణంగా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి తాగి, అనంతరం నీరు తాగాడు. ఆ కొద్దిసేపటికే తలనొప్పి వచ్చింది. ఆ నొప్పిని భరించలేక ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు. రెండు గంటల తర్వాత బ్రూస్‌లీలో చలనం లేకపోవడంతో పరిశీలించగా అప్పటికే లీ ప్రాణాలు వదిలాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -