NTR: వామ్మో.. ఎన్టీఆర్ తో రూ.5 వేల కోట్ల సినిమా తీయనున్నారా?

NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీయటానికి సిద్ధమంటూ తన మనసులో మాట బయటపెట్టిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్. ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసే వార్త ఇది. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులైనా ఇంకా ఆ మేనియా ఎక్కడా తగ్గలేదు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డుని అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ కి, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు వచ్చింది. నాటు నాటు పాటకి ఆస్కార్ అందుకని అంతర్జాతీయ దర్శకులని సైతం ఆకట్టుకుంది ఈ సినిమా. ఇంతకీ విషయం ఏంటంటే.. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది.

 

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల డైరెక్టర్ జేమ్స్ గన్ మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గార్డియన్స్ ప్రపంచంలోకి ఒక భారతీయ నటుడిని పరిచయం చేయాలనుకుంటే ఎవరిని పరిచయం చేస్తారు అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో బోన్లో నుంచి పులులతో పాటు జంప్ చేసిన వ్యక్తితో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను.

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం. అలాగే ఆ సీన్లో అతను చాలా ప్రశాంతంగా కనిపించాడు అంటూ తన మనసులో మాటని బయటపెట్టాడు జేమ్స్ గన్. అంతేకాకుండా ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని తెలిపాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమా కోసం బడ్జెట్ 5,000 కోట్లు కేటాయించనున్నాడని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ కనుక అలాంటి దర్శకుల చేతిలో పడితే దేశం గర్వించదగ్గ నటుడు స్థాయి దాటి ప్రపంచం గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకుంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు అందులో అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -