Bengaluru: కర్ణాటకలో ఏకంగా బస్ స్టాప్ నే మాయం చేసిన దొంగలు.. మామూలు దొంగలు కాదంటూ?

Bengaluru:  ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఘటన ఇంకా మరువకముందే మరొక ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. దొంగలు కూడా దొంగతనాలలో కొత్త కొత్తగా దొంగతనాలకు పాల్పడుతూ ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్నారు. కాగా మొన్నటికి మొన్న కొందరు దొంగలు రోడ్డులోనన్ని దొంగలించగా, మరికొందరు ఏకంగా టిప్పర్ లారీని దొంగలించారు. అలాగె ఇటీవల ఒక వ్యక్తి తెలంగాణలో ఆర్టీసీ బస్సును దొంగిలించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్టాప్ దొంగతనానికి గురైంది. బస్టాప్ ని దొంగతనం చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో 10 లక్షల రూపాయల ఖర్చుతో ఒక బస్టాప్ ను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన వారం రోజులకే ఎవరో ఆ బస్టాప్ ను అక్కడి నుంచి దొంగలించారు. అయితే బస్ స్టాప్ ఏర్పాటుచేసిన వారానికి తరలించడంపై ప్రయాణికులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే అది తరలించడం కాదని, దొంగలించడం అని తెలుసుకున్నారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్ షెల్టర్‌ల నిర్మాణానికి బాధ్యత వహించే ఒక కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రవిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆగస్ట్ 21న బస్టాండ్ ఏర్పాటుచేశామని, 28వ తేదీకి అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బస్టాండ్ చోరీకి గురైన నెల రోజుల తర్వాత తాపీగా కంప్లయింట్ ఇవ్వడంపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన గురించి తెలిసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బస్ స్టాప్ ని దొంగతనం చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -