Bangalore: దారుణం.. బర్త్డే స్టేటస్ పెట్టలేదని దారుణంగా హత్య?

Bangalore: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా హత్యలు ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్న వాటికి హత్యలు చేయడం ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఆత్మహత్యలతో పోల్చుకుంటే హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వ్యవహార కారణంగా ఇప్పటికే ఎంతోమంది మరణించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం వీటన్నింటికీ భిన్నంగా పుట్టినరోజు నాడు స్టేటస్ లో పెట్టలేదు అన్న కారణంతో హత్య చేశారు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. ఈ ఘటన నిజంగానే బెంగళూరులో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. బెంగుళూరు లోని జోగుపాళ్య ప్రాంతంలో విల్సన్ గార్డెన్ నాగ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను స్థానిక ప్రజలను భయందోళనలకు గురి చేస్తూ కరుడుగట్టిన రౌడీ షీటర్ గా పెరు పొందాడు.

ఇప్పటికే ఎన్నో నేరాల్లో పాలు పంచుకుని చాలా కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. అంతేకాకుండా అతని దగ్గర చాలామంది రౌడీ షీటర్లు సహచరులుగా పని చేస్తుండేవారు. అందులో ఒక రౌడీ షీటర్ పేరు కార్తిక్. విల్సన్ గార్డెన్ నాగ వద్ద ఎన్నో రోజులుగా నమ్మకంగా ఉండేవాడు. కాగా ఇటీవల కార్తిక్ పుట్టిన రోజు కావడంతో అతని పుట్టిన రోజు సందర్భంగా తన గురువు అయిన విల్సన్ గార్డెన్ నాగ స్టేటస్ పెట్టలేదు. ఇదే కార్తిక్ కు కోపాన్ని తెప్పించింది. దీంతో పాటు విల్సన్ గార్డెన్ నాగ కార్తిక్ ను గతంలో అనేక సార్లు ఘోరంగా అవమానించినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీటన్నిటినీ మనుసులో పెట్టుకున్న కార్తిక్ విల్సన్ గార్డెన్ నాగను తన తోటి సహచరులతో కలిసి హత్య చేయాలని అనుకున్నాడు. ఆ రోజు కార్తిక్ తన స్నేహితులతో కలిసి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.

 

తరువాత ఒకరోజు ఉదయం తెల్లవారుజామున పథకం ప్రకారమే కార్తిక్ కార్తిక్ జాన్సన్, మగ్గేష్, కార్తీక్, అరుణ్ తో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుని విల్సన్ గార్డెన్ నాగ ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కార్తిక్ కొడవళ్లతో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగను ఆరుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -