Byjus: బైజూస్ దివాళా తీయడానికి కారణాలివా.. పుంజుకోవడం అసాధ్యమా?

Byjus: దేశంలో ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ ఆఫీసులు ఖాళీ చేస్తోంది. ఇలా బైజూస్ కంపెనీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతోనే దివాలా తీసారంటూ వార్త వైరల్ గా మారింది. అయితే ఇలా బైజూస్ దివాళ తీయడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు బైజూస్ ఆఫీసులను ఖాళీ చేస్తున్నారనే విషయానికి వస్తే..బైజూస్ ఆదాయ, వ్యయాల వివరాలను వెల్లడించడం లేదు. ఆ సంస్థపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో దర్యాప్తు చేయించాలన్న ఆలోచన చేస్తోందన్న సమాచారం.

ఇలా ఇన్వెస్టిగేషన్ టీం తో దర్యాప్తు చేయాలని ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలోనే బైజూస్ ప్రధాన నగరాలలో ఆఫీసులను ఖాళీ చేయడం సంతరించుకుంది.ఇప్పటికే పలు ప్రాంతాలలో ఎన్నో బ్రాంచెస్ ఉన్నప్పటికీ పలుచోట్ల పెద్ద ఎత్తున ఖాళీ చేస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నారు.ఇక ఉద్యోగులకు చివరికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

 

బెంగళూరులో మూడు బ్రాంచెస్ ఉండగా అన్ని బ్రాంచెస్ ఖాళీ చేయడంతో మెయిన్ బ్రాంచ్ మాత్రమే విధులను నిర్వహిస్తున్నారు. తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బయటపడటంతో కంపెనీ విశ్వసనీయత తగ్గిపోతోంది. ఇటీవల బోర్డు నుంచి ఆడిటర్ డెలాయిట్ తో పాటు ముగ్గురు బోర్డు సభ్యుల రాజీనామా చేశారు.

 

ఈ విధంగా బైజూస్ సంస్థలన్నింటినీ కూడా ఖాళీ చేస్తూ ఉద్యోగులను కూడా తొలగించారు. ఈ క్రమంలోనే ఈ విషయం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. పెట్టుబడిదారుల నుండి సుమారు $5 బిలియన్ల నిధులను సేకరించిన బైజూస్ తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పడుతోంది. కంపనీ విలువ $22 బిలియన్ల నుండి $5.1 బిలియన్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం భారీ స్థాయిలో దివాలా తీసిన బైజూస్ తిరిగి పుంజుకుంటుందా అన్న సందేహం కూడా అందరిలో నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -