YS Jagan: జగన్ బైజూస్ కు ఆ కారణం వల్లే భారీ షాక్ ఇచ్చాడా?

YS Jagan: విద్యారంగ అభివృద్ధి కోసం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారంటూ, ఈ క్రమంలోనే పేద పిల్లలకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో బైజూస్ తో ఒప్పందం చేసుకున్నారని అప్పట్లో జగన్ అనుకూల పత్రికలు రాసుకొచ్చాయి. కానీ అది చివరికీ అది అందని దాక్షలానే పేద విద్యార్థులకు మారింది.

విద్యావ్యవస్థలో మార్పుల కోసం కృషి చేస్తోన్న జగన్ సర్కారు ఆ దిశగా మరో కీలక ముందడుగు వేస్తున్నట్లు వైసీపీ నేతలు గట్టిగా చెప్పారు. విద్యార్థులకు అధునాతన విద్యను అందించడం కోసం ఎడ్యుటెక్ సంస్థ ‘బైజూస్’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు.

ఈ మేరకు సీఎం జగన్‌ సమక్షంలో విద్యాఖ కమిషనర్ ఎస్‌.సురేష్‌కుమార్.. బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, పబ్లిక్‌పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ ఒప్పందంపై అప్పట్లో సంతకాలు చేశారు. కానీ ఇప్పుడు పూర్తిగా తిరగబడింది. అసలు కథ ఏంటంటే ఆ కంపెనీ గురించి ఇప్పుడు వైసీపీ సర్కారు అస్సలు అంటే అస్సలు మాట్లాడటం లేదు.

బైజూస్‌కు స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ప్రమోట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ కంపెనీ పేరు ఎత్తడం లేదు. ఈ సందర్భంలోనే మరో సంచలనాత్మక విషయం బయటకు వచ్చింది. అసలు బైజూస్ కంటెంట్ ను వద్దనుకుంటున్నారని తెలిసింది. అసలు ట్యాబ్ ల కోసమే ఖర్చుపెడుతున్నామని కంటెంట్ అంతా బైజూస్ ఉచితంగా ఇస్తోందని, ఇది 750 కోట్ల వరకూ ఉంటుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో వచ్చే ఉచిత కంటెంట్ ను ఎందుకు వద్దనుకుంటున్నారో మాత్రం తెలియదు.

 

అయితే ఈ బైజూస్ వ్యవహారంపై అమరావతి సర్కిల్ లో పెద్ద చర్చ నడుస్తోంది. తెరవెనుక జరిగిన తతంగం అంతా ఇదా అని మాట్లాడుకుంటున్నారు. విద్యాశాఖలో చాలా చిత్ర విచిత్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఒప్పందాలను బై జూస్ రవీంద్రన్ పాటించడం లేదన్న కోపం జగన్ లో ఉందంటున్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో రవీంద్రన్, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్మతో కాస్త బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒప్పందాలను ఉల్లంఘించడంతో సీఎంజగన్ కు కోపం వచ్చిందని అందుకే సొంత కంటెంట్ తయారుచేయాలని ఆదేశించిట్లుగా ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -