Cricket: తప్పుకునే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్!.. అదే బాటలో కిట్ స్పాన్సర్?

Cricket: భారత క్రికెట్ జట్టుకు వరల్డ్ క్రికెట్ లో ఉన్న పాపులారిటీ ఎంతో తెలిసిందే. మన టీమ్ కు స్పాన్సర్ చేసేందుకు ప్రముఖ కంపెనీలెన్నో పోటీపడతాయి. క్రికెట్ అంటే పడిచచ్చే జనాలు ఉన్న దేశంలో టీమిండియా స్పాన్సర్ షిప్ దక్కడం అంటే మాటలా. కోట్లు కుమ్మరించి మరీ బిడ్స్ ను దక్కించుకుంటాయి కార్పొరేట్ సంస్థలు. భారత ఆటగాళ్ల జెర్సీపై తమ కంపెనీ పేరు కనిపిస్తే వచ్చే ప్రచారం వేరే లెవల్ కదా. ప్రస్తుతం భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా ఎడ్యుటెక్ సంస్థ ‘బైజూస్’ వ్యవహరిస్తోంది.

 

టీమిండియాతో ఉన్న ఒప్పందాన్ని ‘బైజూస్’ రద్దు చేసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి గత నెలలోనే బీసీసీఐకి ఆ సంస్థ ఓ లేఖ కూడా రాసిందట. నవంబర్ 2023 వరకు అమల్లో ఉండేలా సుమారు రూ.290 కోట్లతో గత జూన్ లోనే బీసీసీఐతో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ కంపెనీ ఎదుర్కొంటున్న పలు ఆర్థిక సమస్యలు, ఇతర కారణాల రీత్యా స్పాన్సర్ షిప్ కొనసాగించొద్దని భావిస్తోందని వినికిడి.

 

బైజూస్ బాటలో ఎంపీఎల్ కూడా..
‘బైజూస్’ స్పాన్సర్ షిప్ రద్దు అంశంపై బుధవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. చివరకు 2023 మార్చి వరకు స్పాన్సర్ షిప్ కొసాగించాలని బైజూస్ కు బీసీసీఐ విజ్ఞప్తి చేసిందని తెలిసింది. మరోవైపు కిట్ స్పాన్సర్ గా ఉన్న ఎంపీఎల్ స్పోర్ట్స్ కూడా తమ ఒప్పంద హక్కులను మరో కంపెనీకి బదలాయించేందుకు అనుమతించాలని బోర్డును కోరినట్లు సమాచారం.

 

కేవల్ కిరణ్​ క్లాతింగ్ లిమిటెడ్ (కేకేసీఎల్)కు కిట్ స్పాన్సర్ షిప్ హక్కులను ఇవ్వమని ఎంపీఎల్ బోర్డును కోరిందని తెలుస్తోంది. దీనిపూ కూడా బోర్డు అధికారులు చర్చించారట. ఇలా ఉన్నపళంగా కిట్ స్పాన్సర్ పేరు మార్పు వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని.. కాబట్టి ఎంపీఎల్ కూడా మార్చి 31, 2023 వరకు కొనసాగాలని బీసీసీఐ విజ్ఞప్తి చేసిందని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -