నాలుక ఇలా ఉంటే ఆ లోపం ఉన్నట్టే!

మన ఆరోగ్యం కోసం వివిధ రకాల పౌష్టిక ఆహార పదార్థాలు, విటమిన్లు తీసుకుంటాము. శరీరంలో విటమిన్లు మినరల్స్‌ సరైన విధంగా తీసుకోకుంటే వివిధ అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా విటమిన్‌–బీ12 డెఫిషియన్సీ అనేది వివిధ సమస్యలలో సాధారణం మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది విటమిన్‌ డెఫిషియెన్సీ ఎదుర్కొంటున్నారు.దేశంలో 47 శాతం మంది వరకు విటమిన్‌ బీ12 డెఫిషియన్సీతో బాధ పడుతుండగా 26 శాతం మంది జనాభాలో మాత్రమే విటమిన్‌ బీ12 సరిపడా ఉందని ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. దీంతో జాగ్రత్తలు పడాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎప్పుడైతే విటమిన్‌ బీ12 శరీరంలో సరైన విధంగా ఉంటుందో అప్పుడు బ్రెయిన్, నరాల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి విటమిన్‌ బీ12 డెఫిషియన్సీను ముందుగా కనుక్కోవడం మంచిది.

లక్షణాలు ఇవే..

చర్మం రంగు లేత పసుపు లోకి మారడం నాలుక ఎరుపు రంగులో ఉంటుంది. మౌత్‌ అల్సర్‌ మాట్లాడే విధానం, నడుచుకునే విధానం మారిపోవడం కంటి చూపు కాస్త కోల్పోతుంది. ఆందోళన, చిరాకు, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు చూపుతాయి.

నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ విటమిన్‌ బీ12 డెఫిషియెన్సీ అనేది శరీరంలో నాలుగు భాగాలలో ఉంటుంది. చేతులు, భుజాలు, కాళ్లు, పాదాలు. ఎప్పుడైతే విటమిన్‌ డెఫిషియెన్సీ ఎదుర్కొంటారో అప్పుడు శరీర భాగాల్లో కొత్త సెన్సేషన్‌ను ఫీల్‌ అవుతారు దాన్నే పరస్తీసియా అంటారు.

పరస్తీసియా ..

పరస్తీసియా పిన్స్, నీడిల్స్‌ అనేది ఒక లక్షణం. ఎప్పుడైతే ఈ లక్షణాన్ని ఎదుర్కొంటారో అప్పుడు మీకు మండుతున్నట్టు, గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఈ సెన్సేషన్‌ అనేది కూడా చేతులు, భుజాలు, కాళ్లు, పాదాల భాగాల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు ఇతర శరీర భాగాల్లోనూ ఇదే విధంగా కలుగుతుంది. కానీ.. దీనితో ఎలాంటి నొప్పి ఉండదు. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు కూర్చుంటారో లేదా నిద్రపోతారో కొన్ని సందర్భాల్లో మన శరీర భాగాల పై ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు ఈ లక్షణం కనబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి

నాలుకపై చూపే ప్రభావం..

శరీరంలో ఎప్పుడైతే విటమిన్‌బీ–12 డెఫిషియన్సీ ఏర్పడుతుందో అప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. నాలుక ఎర్రగ మారడం, మౌత్‌ అల్సర్, వాపురావడం, సోర్స్‌ గ్లాసైటీస్‌ తదితర సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే నాలుక ఎర్రగా మారుతోందో దాన్ని విటమిన్‌బీ–12 డెఫిషియన్నీ లక్షనాలుగా నిర్ధారించాలి.

తినాల్సిన పదార్థాలు..

ఆహార పదార్థాల ద్వారా విటమిన్లను శరీరానికి అందజేయాలి.షెల్‌షిప్‌ పౌల్ట్రీ, పోర్క్, బీఫ్, హ్యామ్, ల్యాంబ్, క్రాబ్‌తో మనం విటమిన్‌బీను పొందవచ్చు. మాంసం తినని వారుంటే పెరుగు, పాలు, చీజ్‌ తదితర పౌష్టిక పదార్థాలను తీసుకుని విటమిన్‌బీ –12ను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. బాదం పప్పు, ఫోర్టీఫైడ్‌ సిరియల్స్, గుడ్లు స్వీట్‌ పొటాటో, క్యారెట్, ఆఫ్రికాట్, బ్రోకలీ క్యాప్సికం తదితర వాటి ద్వారా కూడా విటిమిన్‌బీ–12ను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena Complaint on YS Jagan: ఏపీ ఎన్నికల సంఘం దృష్టికి పవన్ పెళ్లిళ్ల గోల.. జగన్ కు భారీ షాక్ తప్పదా?

Janasena Complaint on YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వెళ్లిన ఏ సభకు వెళ్లిన అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -