Kodali Nani Health: ఆ ఆరోగ్య సమస్యలే కొడాలి నాని పాలిట శాపమయ్యాయా?

Kodali Nani Health: ప్రస్తుతం ఏపీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కొడాలి నాని పేరు కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా కొడాలి నాని సరిగా మీడియా ముందు కనిపించడం లేదు. దీంతో కొడాలి నాని కి అసలు ఏమైంది? ఎక్కడ ఉన్నాడు అని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పేర్ని నాని మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ కొడాలి నాని మాత్రం బయటకు రాలేదు. ఆ విషయం గురించి స్పందించ లేదు. ట్వీట్ కూడా చేయలేదు.

దీంతో కొడాలి నాని ఎక్కుడున్నారని మీడియా ప్రతినిధులు వెదకడం ప్రారంభించారు. కానీ నాని విజయవాడలో లేరు. హైదరాబాద్ లో ఉన్నారో లేదో కూడా తెలియలేదు. మామూలుగా అయితే ఇటువంటి సమయంలో పవన్ కల్యాణ్ కు బూతుల కౌంటర్ ఇప్పించేందుకు కొడాలి నానిని కూడా రంగంలోకి దింపుతారు. కొడాలి నానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న ప్రచారం ఈ కారణంగానే బయటకు వచ్చింది. ఆయన అనారోగ్యంపై రకరకాల ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజమేమిటో స్పష్టత లేదు.

 

ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. కరోనా వచ్చినప్పుడు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటి నుండి ఆయనా గుడివాడలో ఉంటున్నది తక్కువేనని, ఎక్కువగా హైదరాబాద్‌లో ఉంటున్నారని తెలుస్తోంది. కాగా హైకమాండ్ ప్రెస్ మీట్లు పెట్టాలనుకున్నప్పుడే పెడుతున్నారని అంటున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని అతి తక్కువ రోజులు నిర్వహించిన ఎమ్మెల్యేలలో కొడాలి నాని ఒకరు. కొడాలి నాని గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు జరుగుతున్నా వాటిని ఖండించడమో లేకపోతే ఆయనే బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడటమో చేయాల్సింది. అది కూడా చేయకపోవడంతో మరింత ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి కూడా అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అనుమానాలకు ఆ వార్తలకు చెప్పి పెట్టాలి అంటే కోడలి నాని మీడియా ముందుకు రావాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -