Health: వామ్మో.. ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటే అంత డేంజరా?

Health: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూనే ఉన్నారు. చాలామంది అర్ధరాత్రి దాటినా కూడా ఇంకా ఈ ఫోన్ లను వినియోగిస్తూ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్లు కూడా భాగమైపోయాయి.. ఒక్క పూట భోజనం చేయకుండా అయినా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా మాత్రం ఉండలేరు.

స్మార్ట్ ఫోన్ లకు ఎడిక్ట్ అయిపోయారు. రాత్రి పడుకునే సమయంలో కూడా చాలామంది ఫోన్ ని ఉపయోగిస్తూ అలాగే నిద్రపోతూ ఉంటారు. ఒకవేళ రాత్రి పడుకునే సమయంలో మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటే జాగ్రత్త. అలా పడుకోవడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో చాలామంది మొబైల్ ఫోన్లను అతిగా ఉపయోగించడం వల్ల అవి ఓవర్ హీట్ అయిపోతున్నాయి. ఓవర్ హీట్ అయిపోయేసరికి చార్జింగ్ కూడా అయిపోతున్నాయి.

దాంతో అప్పటికే వేడిగా ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకుని వెళ్లి ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కి కొన్ని కొన్ని సార్లు మొబైల్ ఫోన్లు పేలుతూ ఉంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ఇటీవల కూడా తల దిండు కింద స్మార్ట్ ఫోన్ పెట్టుకుని పడుకుంది. కానీ అర్ధరాత్రి సమయంలో ఆ ఫోన్ పేలిపోవడంతో ఆ మహిళ ప్రాణాలు పోయాయి. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాబట్టి ఫోన్ ని ఎప్పుడు కూడా పక్కనే లేదంటే తల దిండుకుందే పెట్టుకుని పడుకోవడం మంచి అలవాటు కాదు. మరొక విషయం ఏమిటంటే మొబైల్ ఫోన్ కొంచెం హీట్ అయినప్పుడు వెంటనే దానిని ఉపయోగించడం మానేయడం మంచిది. లేదంటే ఫోన్ అతిగా హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -