Tea: వేడి టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Tea: టీ ప్రేమికులకు రోజుకు ఒక్కసారైనా టీ తాగకపోతే రోజు గడవదు. చాలామంది ఉదయం లేచిన వెంటనే ఖచ్చితంగా టీ తాగిన తర్వాతనే ఏదైనా పనులు ప్రారంభిస్తూ ఉంటారు. రోజు మొత్తంలో కనీసం ఒక్కసారి అయినా టీ తాగాలని అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఉదయాన్నే టీతో ప్రారంభించడం వల్ల అది మనకు శక్తి నిస్తుంది. నిద్ర నుండి తేరుకొని యాక్టీవ్ గా చేస్తుంది. ఆరోజంతా రిఫ్రెష్ గా ఉంచుతుంది. దాంతో రోజంతా ఉల్లాసంగా, చురుకుగా ఉంటాము. ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది టీ తాగినప్పుడు టీ తాగకు ముందు నీరు తాగితే,మరి కొంతమంది టీ తాగిన తర్వాత నీరు తాగుతూ ఉంటారు.

 

అయితే మామూలుగా టీ తాగక ముందు నీరు తాగితే మంచిదే కానీ టీ తాగిన తర్వాత నీరు తాగడం అంత మంచిది కాదు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజూ ఒక్కసారి మాత్రమే టీ తాగడం మంచిది. అయితే కొందరు టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతారు. టీ కంటే టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం చాలా హానికరం. ఎందుకంటే టీలో కెఫిన్ ఉంటుంది. అందుకే చాలా మందికి టీ తాగగానే దాహం వేస్తుంది. ఒక కప్పు టీలో 50 mg కెఫిన్ ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. ఇది దాహాన్ని పెంచుతుంది. టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, టీ వంటి వేడి పానీయాలతో పాటు నీటిని తాగడం వల్ల అసిడిటీ లేదా నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.

ఎక్కువ చల్లగా ఉండే ఆహార పానీయాలు, మరీ వేడిగా ఉండే ఆహార పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. అలా తీసుకున్నప్పుడు మన నోరు, గొంతు అన్న వాహికపై ప్రభావం చూపిస్తుంది. వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. నోటిలో ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పు పంటి నరాలను దెబ్బతీస్తుంది. అలాగే టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొందరికి టీ తాగగానే కడుపులో గ్యాస్ వస్తుంది. దీన్ని తగ్గించడానికి, ఎక్కువ నీరు త్రాగాలి. మలబద్ధకం తదితర సమస్యలు రావచ్చు. అయితే ఇలా చేయడం వల్ల కడుపులో అల్సర్ వస్తుంది. అంతేకాకుండా టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే ముక్కు నుంచి రక్తం కారుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -