Fast Eating: వేగంగా ఆహారం తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. అలా చేస్తే ప్రాణాలకు ముప్పే!

Fast Eating: మీరు వేగంగా ఆహారం తీసుకుంటున్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.చాలామంది ఆహారాన్ని చాలా ఎక్కువ సమయం పాటు తింటూ ఉంటారు. ఇలా ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని అలా కాకుండా ఆహారం సరిగా నమలకుండా చాలా వేగంగా తినే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా వేగంగా ఆహారం తీసుకునే వారిలో అధికంగా బరువు పెరగడమే కాకుండా ఉబకాయానికి దారితీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి వారిలో షుగర్ లెవెల్స్ త్వరగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయట. ఓ నివేదిక ప్రకారం నిదానంగా ఆహారం తీసుకునే వారి కన్నా వేగంగా ఆహారం తీసుకునే వారిలోనే ఆకలి ఎక్కువగా పుడుతుందని తెలియజేశారు.

 

ఇక వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల ఏరోసిస్ గ్యాస్ట్రిటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీనివల్ల కడుపులో పుండు ఏర్పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.భోజనం వేగంగా తినటం వల్ల కలిగే ప్రయోజనాల కన్నా వచ్చే అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే భోజనం చేసేటప్పుడు నిదానంగా ఆహారాన్ని నమిలి తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల బాగా జీర్ణం అవ్వడమే కాకుండా అందులో ఉన్నటువంటి పోషకాలు విటమిన్స్ మన శరీరానికి సక్రమంగా అందుతాయి.ఇక చాలామంది వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో తినాలంటే తినాలన్న ఉద్దేశంతో ఆహారాన్ని వేగంగా తింటారు. అయితే మీ ఆరోగ్యం కోసం కాస్త సమయం కేటాయించి ఆహారాన్ని నిదానంగా నమిలి తినడం ఎంతో మంచిది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -