Vitamin B12: విటమిన్ బి12 లోపం ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Vitamin B12: ఆరోగ్యవంతంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు తీసుకోవాల్సిందే. అలా కొన్ని కొన్ని పదార్థాల ద్వారా మనం ఆయా విటమిన్లను పొందుతూ ఉంటాం. మన చేయడానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ బి 12 కూడా ఒకటి. విటమిన్ బి12 మన శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మన శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే, దాని వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ బి12 శరీరంలో చాలా తక్కువగా ఉంటే, అది కూడా తీవ్రమైన పరిస్థితికి కూడా దారి తీస్తుంది.

అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది విటమిన్ బి 12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి 12 లోపం ఉంటే, మలబద్ధకం, విరేచనాలు, చిరాకు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిరాశ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా విటమిన్ బి 12 లోపం వల్ల శరీరంలో ఇంకా ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బలహీనత, అలసట, తరచు తల తిరగడం, క్రమం తప్పకుండా గుండె కొట్టుకోకపోవడం,శ్వాస ఆడకపోవడం, చర్మం పసుపుగా మారడం,జిడ్డు నాలుక, మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ సమస్య వంటి సమస్యలువస్తాయి.

 

అలాగే ఆకలి తగ్గుదల దృష్టి, నరాల సమస్యలు, నడవడం కష్టం అవడం,చూపు మందగించడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో విటమిన్ B12 తక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, మన శరీరంలో ఈ విటమిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఒకవేళ కనుక మీరు మాంసాహారులైతే గుడ్లు, మాంసం, చికెన్, చేపలు మొదలైన వాటిని ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శాఖాహారులైతే, విటమిన్ బి12 బలవర్థకమైన తృణధాన్యాలను ఉపయోగించాలి. ఇవే కాకుండా విటమిన్ బి 12 స్థాయిని పెంచుకోవడానికి వైద్య సలహాపై ఇంజెక్షన్లు కూడా తీసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -