Vivekananda Reddy Murder Case: వివేకా కేసు విషయంలో రూట్ మార్చిన సీబీఐ.. ఆ నిందితులకు బెయిల్ కష్టమేనా?

Vivekananda Reddy Murder Case: వివేకా హత్యకేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నట్టు పట్టుబిగిస్తుంది. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఎవరు పిటిషన్లు వేసినా.. తన వంతుగా వాదనలు వినిపిస్తోంది. గతేడాది కేసు విచారణను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ సీబీఐ అధికారులపైనే కేసు పెట్టి వేధించింది. అయితే.. వైసీపీ కేసు పెట్టినంత మాత్రాన తాము బలహీనులం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. టైం వచ్చినపుడు కేసు ఎలా వాదించాలో తమకు తెలుసని చెప్పకనే చెబుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై.. సీబీఐ కౌంటర్ పిటిషన్ చూస్తే అవినాష్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ కావడం ఖాయమే అనిపిస్తోంది. అసలు బెయిల్ కొనసాగించాలని కోరడానికి అవినాష్ తరుఫున న్యాయవాదుల దగ్గర ఒక్క అవకాశం కూడా లేకుండా కౌంటర్ దాఖలు చేశారు.

బెయిల్ పిటిషన్ వేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ విషయంలో కూడా సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ వేసింది. శికశంకర్ రెడ్డి హైద్రాబాద్‌లో ఉన్నారు. ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన హైద్రాబాద్ నుంచే పులివెందుల ఎమ్మెల్యే ఎన్నికను, కడప లోక్‌సభ ఎన్నికను పర్యవేక్షిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదిస్తోంది. అవినాష్ ను అరెస్ట్ చేయాలని సునీత అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కానీ, ఆయన్ని అరెస్ట్ చేయలేకపోవడంతో.. సీబీఐ పలు ఆరోపణలను ఎదుర్కొంది. కానీ.. ఇటీవల ఈకేసులో సీబీఐ పట్టు బిగించింది.

ఇటీవల అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విషయంలో కూడా దస్తగిరి వాదనలకు బలాన్ని ఇచ్చేలా సీబీఐ సహకరించింది. నేరుగా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేయకపోయినా.. దస్తగిరి వేసిన పిటిషన్ పై గట్టిగా సపోర్టు చేసింది. దస్తగిరి వాదనల్లో నిజం ఉందని తెలిపింది. అవినాష్ రెడ్డి ఇంకా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించింది. నిజానికి ఎవరికైనా బెయిల్ మంజూరు అయితే.. సాక్షులను ప్రభావితం చేయొద్దని కోర్టు మొదటి షరతు విధిస్తుంది. కానీ, అవినాష్ రెడ్డి ఆ షరతులను పాటించలేదు. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్నే అటు దస్తగిరి, ఇటు సీబీఐ బలంగా కోర్టు ఎదుట పెట్టాయి.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తనను ఇరికించి జైలుకు పంపారని దస్తగిరి కోర్టు ఎదుట చెప్పారు. ఆ కేసులో కడప జైల్లో ఉన్నపుడు తనను నిందితులు ప్రలోభాలకు గురి చేశారని చెప్పారు. ఇవే అంశాలు దస్తగరి, సీబీఐ.. కోర్టుకు తెలిపారు. కోర్టు ఈ నెల 15కు విచారణ వాయిదా వేసింది. వాదనలు విన్న నిపుణులు అవినాష్ బెయిల్ రద్దు కావడం ఖాయంగా చెబుతున్నారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అంటే.. నామినేషన్ల కంటే ముందే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసినా.. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంతో సీబీఐపై చాలా విమర్శలు వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సీబీఐ ఉక్కిరి బిక్కిరి అయింది. అయితే, ఈసారి మాత్రం ఆ మాట పడే ఛాన్స్ ఇవ్వలేదు. కోర్టు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసేలా వాదనలు వినిపించింది. మొత్తానికి ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా ఎవరు పిటిషన్ వేసినా.. వారికి అనుకూలంగా సీబీఐ తన వాదనలు వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pensioners Party Chief Subbarayan: ఒక్కో విశ్రాంత ఉద్యోగికి జగన్ 2.5 లక్షలు ఇవ్వాలట.. పాలనలో ఇంత అన్యాయమా?

Pensioners Party Chief Subbarayan: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఓటు వేయడానికి ముందు చంద్రబాబు నాయుడు హయామంలో జరిగిన అభివృద్ధి జగన్...
- Advertisement -
- Advertisement -