Vizag Drugs Case: డ్రగ్స్ కేసులో ఆధారాలు మాయం చేసే కుట్ర చేస్తున్నారా.. తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలతోనే అంటూ?

Vizag Drugs Case: విశాఖ డ్రగ్స్ కేసులో ఏపీ పోలీసులు, అధికార పార్టీ వ్యవహారం తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తుంటే.. పోలీసులు మరో వైపు ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకినాడ జిల్లా మూలపేటలో సంధ్య ఆక్వా బస్సులో డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ లు, బ్యాంక్ చెక్కులు దొరకడం కేసులో కీలకం మారింది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టేందుకు పయత్నించింది. సంధ్య ఆక్వా ఎక్స్ పోర్ట్ యాజమాన్యానికి నోటీసులు విడుదల చేసి… విశాఖ వదిలి వెల్లొద్దని ఆదేశించింది. మరోవైపు మూలపేటలోని ఆ పరిశ్రమలో 2 రోజుల పాటు సీబీఐ దాడులు నిర్వహించింది. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని తెలుస్తోంది. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్‌ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇక్కడ వరకు అంతా బానే ఉన్నా కొత్త మూలపేట ఎస్‌ఈజెడ్‌ కాలనీలో సంధ్య ఆక్వాకు చెందిన బస్సు కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా బస్సు అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బస్సు ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. బస్సులో ఫైల్స్‌, కొన్ని పరికరాలు ఉన్నట్టు తెలిపారు. కానీ.. ఆ ఫైల్స్, పరికరాలు గురించి సీబీఐకి సమాచారం ఇవ్వలేదు. నిజానికి ఆ సమయంలో ఆ బస్సును సీబీఐ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. కానీ.. తర్వాత చూస్తే ప్లేట్ ఫిరాయించారు. కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, హార్డు డిస్కులు సీబీఐ చేతి వరకూ చిక్కలేదు. సంధ్యా ఆక్వా కంపెనీ సీబీఐ దృష్టి మరల్చి బస్సులో మరో చోటకు తరలించినట్టు తేలింది. దీంతో.. పోలీసులపై సీబీఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సులో కేసుకు అవసరమైన కీలక పత్రాలు ఉన్నప్పుడు బస్సును సీజ్ చేసి తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ పోలీసులపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. బస్సులో వందలాది డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు గుర్తించినప్పుడు తమకు సమాచారం ఇవ్వరా అంటూ సీబీఐ అధికారులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కంపెనీ వీటిని రహస్యంగా బస్సులో తరలించడం చర్చనీయాంశమైంది. తనిఖీల అనంతరం బస్సును యథావిధిగా కంపెనీకి అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసులో సంధ్య ఆక్వా కంపెనీ అడ్డంగా దొరికిపోయిందని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. తెరముందు సంధ్య ఆక్వా కంపెనీ ఉండగా.. తెరవెనక వైసీపీ నేతలు ఉన్నారని ఆయన అనుమానించారు. బ్రెజిల్ నుంచి వచ్చిన నౌకలో పాతిక వేల కిలోల డ్రై ఈస్ట్‌లో డ్రగ్స్‌ కలిసి ఉన్నాయని సీబీఐ అధికారులు కనుగొన్నారు. అయితే సంధ్యా ఆక్వా కంపెనీ ఈ కేసులో కీలక అంశాలను మసిపూసి మారేడు కాయను చేయడానికి ప్రయత్నిస్తుంది. కేసులో సీబీఐ ఎంటర్ అయిన తర్వాత ఆక్వా కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము దిగుమతి చేసుకున్న డ్రై ఈస్ట్‌ను బ్రెజిల్ వ్యవసాయ మంత్రిత్వశాఖ జనవరి 17న తనిఖీ చేసి సర్టిపికేట్ ఇచ్చిందని ఆక్వా కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. అయితే, అందులో ఏ మాత్రం నిజం లేదు. డ్రై ఈస్ట్ తో వస్తున్న నౌక జనవరి 14న బ్రెజిల్ నుంచి బయలుదేరి జనవరి 16కి విశాఖ చేరుకుంది. ఓషన్‌ నెట్‌వర్క్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. విశాఖకు జనవరి 16న చేరుకున్న నౌకను బ్రెజిల్‌ అధికారులు జనవరి 17న ఎలా తనిఖీలు చేస్తారు? అంటే.. సంధ్య ఆక్వా కంపెనీ కేసులో ఆధారాలను తారుమారు చేయాలని చూస్తుందని అర్థం అవుతోంది. ఇప్పుడు బస్సులో ఉన్న కీలక ఆధారాలు కూడా సీబీఐ చేతికి చిక్కకుండా మాయం చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -