CM Jagan: సీబీఐ కేసుల్లో వాయిదాలతో రికార్డు సృష్టించిన సీఎం జగన్….!

CM Jagan: అవినీతి సంపాదన అక్రమ కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక రికార్డు సృష్టించారు. సీబీఐ వేసిన జగతి పబ్లికేషన్స్ కేసులో 381 సారి వాయిదా తీసుకుని రికార్డు సృష్టించారు. ఇక ఈడీ కేసుల్లో 251 సార్లు వాయిదా పొందారంటే ఈయన ఘనతను ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు.

 

2012లో పక్కా ఆధారాలతో సీబీఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండడం తర్వాత విడుదలవడం అంతా మనకు తెలిసిందే. అయితే అప్పటినుండి ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకి హాజరు అవ్వాలని షరతుతో బయటకు వచ్చిన జగన్ సీఎం అయ్యేంతవరకు కూడా ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యేవారు. అయితే సీఎం అయిన తర్వాత ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్లకుండా వాయిదాలు తీసుకుంటున్నారు. తాజాగా తీసుకున్న వాయిదాతో కలిపి ఇప్పటికీ 381 సార్లు కోర్టుకి ఎగొట్టి రికార్డు సృష్టించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా సరే పెట్టుబడులు పెడతానికి వస్తే అందులో తన కొడుకుకి వాటా ఇవ్వాలని నిబంధనతో వారికి పర్మిషన్ ఇచ్చేవారు.

అలా జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా లక్ష కోట్లు పైగానే సంపాదించారు. ఇందులో A1 గా జగన్ మోహన్ రెడ్డి పేరు ఉంటే A2గా విజయసాయిరెడ్డి పేరు,A3 గా జగతి పబ్లికేషన్స్ పేరు చేర్చారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి బెయిల్ పొంది 10 ఏళ్ల నుండి బయట తిరుగుతున్నారు. జగతి పబ్లికేషన్స్ లో మోసపూరిత పెట్టుబడులు పెట్టించడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది. విజయసాయిరెడ్డి తో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలో జగదీపబ్లికేషన్స్ లో రూ.10 వాటాను రూ.350 చేసి ప్రీమియం గా నిర్ణయించారు. తప్పుడు సమాచారం ఇచ్చి విజయసాయిరెడ్డి జగతి విలువను రూ.3050 కోట్లుగా ముదింపు చేశారు. బనగానపల్లెలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిమెంట్ పరిశ్రమ నిర్వహించుకోవాలంటే జగన్ కి చెందిన జగతి పబ్లికేషన్స్ లో ఐదు కోట్ల వాటా పెట్టాలని చెన్నైకి చెందిన జయలక్ష్మి టెక్స్టైల్స్ డైరెక్టర్ ను విజయసాయిరెడ్డి బెదిరించారు.

 

అయితే ఈ కేసులు విచారణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. 2012లోనే ఈ కేసును కొట్టివేయాలని జగతి పబ్లికేషన్స్, ఇతర సంస్థల తరఫున హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు హైకోర్టు నిరాకరించగా ఈ కేసులో నుండి తమ పేరును తొలగించాలని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. మరికొందరు నేరుగా హైకోర్టును ఆశ్రయించి ఈ కేసును కొట్టివేయాలని కోరారు. క్వాష్ పిటిషన్ పైన విచారణ పూర్తయ్యేంత వరకు కేసులు విచారణ ముందుకు సాగకుండా స్టే పొందారు. సిబిఐ విచారణకు రావాలని ఎన్ని సార్లు పిలిచినా ప్రజాసేవ పేరుతో తప్పించుకుని జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు. విచారణ జరిగే ప్రతి శుక్రవారం కూడా ఏదో కార్యక్రమం ఉండేలాగా ప్రణాళిక రూపొందిస్తూ ఉంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -