Viveka Murder Case: వివేకా గురించి మాట్లాడొద్దు… జగన్‌ రాయి దాడి గురించి మాట్లాడొచ్చు.. ఇవేం రూల్స్ అంటూ?

Viveka Murder Case: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వైయస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా గెలుపొందడం కోసం వైఎస్ అవినాష్ రెడ్డిని దోషిగా చూపెడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకాను హత్య చేసింది వైయస్ అవినాష్ రెడ్డి అని ఆయనని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు అంటూ ఈమె ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ప్రసంగిస్తున్నారు.

ఇలా వైయస్ షర్మిల మాటలను ఆలోచిస్తున్నటువంటి కడప ప్రజలలో కాస్త వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. దీంతో షర్మిలకు అడ్డుకట్టు వేయకపోతే తమకే ప్రమాదం పొంచి ఉందని గ్రహించినటువంటి వైసీపీ నేతలు ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఇలా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుకూడదని చెప్పినటువంటి ఈసీ జగన్ రాయి దాడి గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగితే అది ప్రతిపక్ష నేతలు అతనిపై హత్య ప్రయత్నం చేసారంటూ తన సొంత మీడియాలో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా పోలీసులు కూడా ఇది హత్యకు ప్రయత్నమే అంటున్న నిర్ధారణకు వచ్చారు.

కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్ల దాడి జరిగింది ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా వివేక హత్య కేసు గురించి మాట్లాడితే తప్పు జగన్ రాయి దాడి గురించి మాట్లాడితే తప్పు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ కుట్ర వెనక విజయవాడ టిడిపి ప్రధాన నేత బోండా ఉమ హస్తం ఉంది అంటూ కూడా బ్లూ మీడియా ప్రచారాలను మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ పలువురు టిడిపి నేతలు మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -