Three Capital Issue: ఏపీలో మూడు రాజధానుల అంశంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం

Three Capital Issue: ఏపీలో మూడు రాజధానుల అంశం కాక రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వార్ కు ఈ వ్యవహారం దారి తీసింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. మూడు రాజధానులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఇదే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాజకీయాలన్నీ మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మూడు రాజధానులే ముద్దు అంటూ వైసీపీ నేతలు చెబుబుతుండగా.. మూడు రాజధానులు వద్దు.,. అమరావతే ముద్దు అంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో మూడు రాజధానుల వేదికగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

అయితే ఈ క్రమంలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ సహయమంత్రి నిత్యానంద రాయ్ స్పంించారు. ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవని, దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏ రాష్ట్రానికి అయినా ఒక రాజధాని మాత్రమే ఉంటుందని తెలిపారు. గురువారం మంత్రి నిత్యానందరాయ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిత్యానందరాయ్ మూడు రాజధానులపై ఏపీలో జరుగుతున్న రచ్చపై స్పందించారు. జమ్మూకశ్మీర్ లో రెండు రాజధానులు ఉన్నాయని, అక్కడ మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఒక రాజధాని, వేసవి కాలంలో మరొక రాజధానిని ఏర్పాటు చేసుకున్నారన్నారు.

కానీ మూడు రాజధానులు ఎక్కడా లేవని హోంమంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. అలాగే అమరావతి రైతుల పాదయత్రపై నిత్యానందరాయ్ స్పందించారు. అమరావతి రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. వారిని అడ్డుకోవడం, ఉద్రికత్తలు సృష్టించడం సరికాదని మనవతారాయ్ చెప్పారు. రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడంపై డీజీపీతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలిస్తామని టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రైతుల పాదయాత్రపై అధికార వైసీపీ పార్టీ ఆటంకాలు కలిగించడంపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని టీడీపీ ఎంపీలు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమరావతి రైతుల పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుండగా.. ఈ నెల 15కి విశాఖలోకి అడుగుపెట్టనుంది. రైతుల పాదయాత్రకు పోటీగా విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. అమరావతి రైతులు విశాఖలో అడుగుపెట్టనున్న 15వ తేదీనే వారికి పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించనుండటం చర్చనీయాంశంగా మారింది.

ఇక అదే రోజు జనసన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించనుండటం, అదే రోజు విశాఖలోని టీడీపీ కార్యాయలంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు చెందిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, మాజీ జడ్పీ ఛైర్మన్, ఎంపీ అభ్యర్థులు సమావేశం కానునన్నారు. ఒకే రోజు అందరూ విశాఖలో సమావేశాలు నిర్వహిస్తుండటంత ోఆ రోజు విశాఖలో ఏం జరగబోతుందనేది హైటెన్షన్ క్రియేట్ చేస్తోంది.

పవన్ కల్యాణ్ 15,16,17వ తేదీలలో అక్కడే ఉండనున్నారు. 15వ తేదీన ఉత్తరాంధ్ర జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మూడు రాజధానులపై వైసీపీ చేస్తున్న రాజకీయం, పార్టీ బలోపేతంపై జనసేన నేతలతో చర్చించున్నారు.న ఇక 16,17వ తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమం విశాఖలో నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను లిఖితపూర్వకంగా వినతిపత్రం ద్వారా తెలుసుకోనున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కౄషి చేయనున్నారు. ప్రజల నుంచే వచ్చే వినతిపత్రాలను ప్రభుత్వ శాఖల అధికారులకు పంపనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -