Chaitu-Sam: చైతూ ఎఫైర్ల గురించి సమంత ఏమన్నారో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Chaitu-Sam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న సినీ కుటుంబాల్లో అక్కినేని వారి కుటుంబం ఒకటి. టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు సాధించిన అక్కినేని కుటుంబ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్న మూడో తరం నటులు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్. అక్కినేని నాగచైతన్యకు ఈ మధ్యన మంచి గుర్తింపు వస్తుండటం తెలిసిందే.

అక్కినేని నాగచైతన్య తనతో పాటు నటించిన హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత విడిపోవడం తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో అతడు ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటనతో పాటు అతడికి ఉన్న ఎఫైర్లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంటి నుండి వెళ్లిపోయిన నాగచైతన్య:

అక్కినేని నాగచైతన్య తన తండ్రి అక్కినేని నాగార్జున వద్ద కన్నా తాత రామానాయుడు ఇంట్లోనే ఎక్కువగా ఉండే వాడు. వేసవి సెలవుల్లో మాత్రమే నాగచైతన్య నాగార్జున ఇంటికి వచ్చేవాడట. అయితే నాగచైతన్య ఉన్నన్నాళ్లు ఎంతో కలగా ఉంటుందని, అతడు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో బాధగా అనిపించేదని అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. సెలవులకు తిరిగి వస్తానని నాగచైతన్య అనే వాడని, అయినా తనకు మాత్రం బాధగా అనిపించేదని, కొన్నిసార్లు ఏడుపు కూడా వచ్చేదని నాగార్జున తెలిపాడు.

చైతూకు ఎఫైర్లు ఉన్నాయా?:

అక్కినేని నాగచైతన్య ఎఫైర్ల గురించి సమంత ఆసక్తికర కామెంట్లు చేసింది. సమంతకు ప్రపోజ్ చేసి, ఓకే చేసుకోవడానికి ఆరు సంవత్సరాలు పట్టిందని నాగచైతన్య వివరించగా.. ఆ ఆరు సంవత్సరాల్లో చై చాలామంది అమ్మాయిల వెంట పడ్డాడని, అన్ని సంవత్సరాల తర్వాత తన టోకెన్ వచ్చిందని సమంత కామెంట్ చేసింది. అయితే అప్పట్లో చైతూకి ఎఫైర్లు ఉండేవని సమంత చెప్పకనే చెప్పగా.. వీరిద్దరి విడాకులకు ఈ అంశాన్ని కొంతమంది ముడిపెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -